బీజేపీ టికెట్ ఇస్తుందని ఆశిస్తున్నా: పరిపూర్ణానంద

BJP, Ticket, Paripurnananda, Hope BJP will give me Ticket says Paripurnananda, paripurnananda, Lok sabha elections, BJP, Hindupur MP Ticket, Swami Paripoornananda, Bharatiya Janata Party, Telangana Elections, Telangana Politics, Telangana Political Updates, Mango News Telugu, Mango News
paripurnananda, Lok sabha elections, BJP, Hindupur MP Ticket

త్వరలోనే దేశంలో లోక్‌సభ ఎన్నికల నగారా మోగనుంది. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలయిన బీజేపీ, కాంగ్రెస్ స్పీడ్ పెంచేశాయి. దూకుడుగా ముందుకెళ్తున్నాయి. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని భారతీయ జనతా పార్టీ పరితపిస్తోంది. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈ మేరకు బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తోంది. ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. అయితే కొందరు అభ్యర్థుల పేర్లు ఇప్పటికే ప్రచారంలోకి వచ్చేశాయి. అందులో కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానందను లోక్ సభ ఎన్నికల బరిలోకి దింపాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఏపీలోని హిందూపూర్ నుంచి ఆయన్ను పోటీ చేయించాలని ఆలోచిస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో పలుమార్లు బీజేపీ గెలుపు కోసం పరిపూర్ణానంద పనిచేశారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ ఇంఛార్జ్‌గా పని చేశారు. బీజేపీ గెలుపు కోసం ప్రచారాల్లో పాల్గొని తీవ్రంగా కృషి చేశారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ గెలుపు కోసం తీవ్రంగా చమటోడ్చారు. ఈక్రమంలో పరిపూర్ణానందను బరిలోకి దింపాలని బీజేపీ ఆలోచిస్తోందట.

అయితే పెద్ద ఎత్తున ఈ వ్యవహారంపై ప్రచారం జరుగుతున్నప్పటికీ అటు బీజేపీ హైకమాండ్ మాత్రం స్పందించలేదు. కానీ మొట్టమొదటిసారి స్వామి పరిపూర్ణానంద స్పందించారు. బీజేపీ హైకమాండ్ ఆదేశిస్తే హిందూపూర్ నుంచి పోటీకి తాను సిద్ధంగా ఉన్నానని పరిపూర్ణానంద వెల్లడించారు. ఇప్పటికే హిందూపూర్‌లో ఉన్న పరిచయాలతో తన భావాలను హైకమాండ్‌కు తెలియజేశానని చెప్పుకొచ్చారు. హిందూపూర్ అభివృద్ధికి.. పురాతన కట్టడాల పరిరక్షణకు తోడ్పడుతానని అన్నారు. అటు హైకమాండ్ కూడా తనకు టికెట్ ఇస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 11 =