
సార్వత్రిక ఎన్నికల సమరంలో అంతిమ ఘట్టం మొదలైంది. ఇన్నిరోజులు ఏ పార్టీ ఏం చేస్తుందో విన్న జనం.. తమకు నచ్చిన వారికి ఈవీఎం బ్యాలెట్లలో తీర్పు నిక్షిప్తం చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలైంది. తెలంగాణలో ఈరోజు 17 లోక్‌సభ స్థానాలకు, ఒక అసెంబ్లీ (కంటోన్మెంట్) స్థానానికి ఎన్నికలు జరుగుతన్నాయి. 17 ఎంపీ స్థానాల్లో మొత్తం 525 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో మహిళా అభ్యర్థులు 50 మంది ఉండడం గమనార్హం. అత్యధికంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలో అత్యధికంగా 45 మంది పోటీలో ఉన్నారు. అతి తక్కువగా అదిలాబాద్ నియోజకవర్గం బరిలో 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
కాగా, రాష్ట్రం మొత్తంమ్మీద మూడు కోట్ల 32 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఎంత మంది ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వస్తారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎందుకంటే.. 2014 నాటి ఎన్నికలతో పోలిస్తే.. 2019 ఎన్నికల్లో పోలింగ్ శాతం భారీగా తగ్గింది. 2019తో పోల్చితే.. ఈ సంవత్సరం తగ్గుతుందా, పెరుగుతుందా అనేది ఉత్కంఠగా మారింది. పోలింగ్ శాతం కొన్నిచోట్ల అభ్యర్థుల భవితవ్యాన్ని మార్చేస్తుంది. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో పోలింగ్ శాతం 70.75గా నమోదైంది. గత ఎన్నికల్లో అది 62.25 శాతంగా ఉంది. అంటే 8.50 శాతం ఈసారి ఓటింగ్ తగ్గింది. ఈ లెక్కన లక్షలాది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. 17 లోక్‌సభ నియోజకవర్గాలకు గాను అత్యధికంగా ఖమ్మంలో 75.61 శాతం పోలింగ్ నమోదవగా.. అత్యల్పంగా హైదరాబాద్ లో 39.49 మేర ఓట్లు పోలయ్యాయి. మల్కాజిగిరి సెగ్మెంట్ లో 42.75.. సికింద్రాబాద్ సెగ్మెంట్ లో 45 శాతం ఓటింగ్ నమోదైంది.
17 లోక్‌సభ స్థానాలకు గాను హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి భాగ్యనగరం పరిధిలో ఉన్నాయి. మిగతా 14 స్థానాల్లో 50 శాతానికి మించి పోలింగ్ నమోదైతే.. నగరంలోని ఈ మూడు నియోజకవర్గంలో 50 శాతం లోపు మాత్రమే ఓట్లు పోల్ కావడం గమనార్హం. ఈనేపథ్యంలో ఈసారి కూడా హైదరాబాద్ టాక్ ఆఫ్ ద ఓటింగ్ గా మారింది. పట్టణ ఓటర్లకు ఎప్పుడూ బద్దకం అని ప్రతిసారీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈక్రమంలో ఓటర్లలో చైతన్యం పెరుగుతుందా, లేదా అనే ఆసక్తి ఏర్పడింది. అయితే.. సొంతూర్లలో ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి భారీగా బయలుదేరారు. వారిలో కొంత మంది నగరంలో కూడా ఓటరుగా నమోదై ఉన్నారు. వీరంతా ఊరిలోనే ఓటు వేస్తే.. అది నగర పోలింగ్ శాతంపై పడే అవకాశం ఉంది.
నగర పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్లలో గతంలో అతి తక్కువ పోలింగ్ నమోదు కావడానికి కారణాలు అనేకం. ఈ మూడు నియోజకవర్గాల్లో చూసినట్లయితే దాదాపు 70 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అందులో వివిధ జిల్లాల నుంచి వచ్చి హైదరాబాద్ లో నివసిస్తున్నవారు కొందరుండగా.. ఏపీకి చెందిన మరికొందరు ఉన్నారు. అయితే దాదాపు 10-15 లక్షల మందికి వారి స్వంత ఊళ్లల్లో కూడా ఓట్లు ఉన్నాయి. హైదరాబాద్ లో నివసిస్తున్న ఏపీ ప్రజలు ఎన్నికల వేళ ఆంధ్రకు తరలివెళ్లారు. అక్కడ లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగడంతో చాలామంది ఓటు వేసేందుకు వెళ్లిపోయారు. అలా నగర పరిధిలో ఓటింగ్ శాతం తగ్గినట్లైంది. ఇప్పుడు కూడా ఏపీలో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈక్రమంలో హైదరాబాద్లోని ఓటింగ్ శాతం నమోదుపై ఆందోళన వ్యక్తం అవుతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY