చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం ఉద్యమం ఇకపై మరింత ఉధృతం.. పోస్టర్‌ విడుదల చేసిన ఎమ్మెల్సీ కవిత

BRS MLC Kalvakuntla Kavitha Released Poster Regarding The Movement For Womens Bill,BRS MLC Kalvakuntla Kavitha,Kavitha Released Poster For Womens Bill,The Movement For Womens Bill,Mango News,Mango News Telugu,Women Reservation Bill is very special,K Kavithas hunger strike,Women's bill,BRS Party,Kalavakuntla Kavitha News,BRS MLC Kalvakuntla Kavitha Latest News,Movement For Womens Bill News Today,Wont Rest Till Parliament Passes,MLC Kavitha Womens Bill News Today

దేశవ్యాప్తంగా చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ అందుకు అనుగుణంగా పార్లమెంటులో మహిళా బిల్లును తీసుకురావాలంటూ తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉద్యమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె మహిళా బిల్లు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నారు. దీనిలో భాగంగా ఎమ్మెల్సీ కవిత శుక్రవారం సామాజిక మాధ్యమం వేదికగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు ప్రాధాన్యం కాకూడదు అంటూ పోస్టర్‌లో పేర్కొన్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని విస్తరించడంలో భాగంగా వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ క్రమంలో దేశంలోని అన్ని యూనివర్సిటీలు, కాలేజీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, చర్చలు వంటివి నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

కాగా చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడానికి మహిళా బిల్లును తీసుకురావాలని కేంద్రాన్ని కోరుతూ.. ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే దేశరాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్ష చేయడం తెలిసిందే. అలాగే ఆ తర్వాత మరోసారి ఇదే డిమాండ్‌పై దాదాపు 18 విపక్ష పార్టీల లోని మహిళా విభాగాలతో పాటు పలు మహిళా సంఘాలతో భారత్ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే మహిళా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని కవితతో పాటు పలు పార్టీల నేతలు నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించక పోవడంతో తమ ఆందోళనను మరింత తీవ్రతరం చేయాలని ఎమ్మెల్సీ కవిత నిర్ణయించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − 3 =