
ఏపీలో అక్కడడక్కడ చెదురుమదురు ఘటనలు తప్ప.. ప్రస్తుతానికి పోలింగ్ ప్రశాంతంగానే జరుగుతుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూ కట్టడంతో రాజకీయ పార్టీలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీల నేతలు తమకే కచ్చితంగా ఓటు వేస్తారన్న నమ్మకమున్న ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికలో వృద్ధులు, మహిళలు, యువకులు వచ్చి ఓటు వేయడంతో ఆ ఓటర్లు తమకు అనుకూలంగా ఉన్నారంటూ ప్రతీ నాయకుడు భావిస్తున్నాడు.
ఇలా ఓటర్లంతా పోలింగ్ కేంద్రాలకు పెద్దయెత్తున తరలి రావడం తమకు లాభమంటే తమకు లాభమంటూ అధికార ప్రతిపక్ష నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో ఐదేళ్లుగా అభివృద్ధి లేకపోవడంతో ఆగ్రహించిన ఓటర్లు..ఇప్పుడు ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఓటు వేశారంటూ టీడీపీ చెబుతోంది. ఏపీలో యువత ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్లే ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారని, అందుకే ఈసారి ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు వేయడానికి ఉత్సాహంతో ముందుకు వచ్చారని అంటున్నారు. మహిళలు అయితే ఫ్రీ బస్సు, మూడు గ్యాస్ సిలిండర్ల హామీతోనే ఇలా క్యూ కట్టారని చెబుతున్నారు. పెన్షన్ కూడా నాలుగు వేల రూపాయలకు పెంచడం వల్ల వృద్ధులు కూడా ఎక్కువ మంది వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని చెబుతున్నారు.
అంతేకాదు యూత్ ఎక్కువగా ఓటు వేయడం తమకు లాభమనే అభిప్రాయంలో కూటమి పార్టీలు ఉన్నాయి. అదే సమయంలో తమ కుటుంబంలో సంక్షేమ పథకాలు అందుతుండటంతో ..పెద్దలకు భరోసా ఉంటుందన్న నమ్మకంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఓట్లు వేస్తున్నారని మరో వాదన కూడా వినిపిస్తుంది. మొతట్తంగా పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడ చూసినా వృద్ధులు, మహిళలు, యూత్ కనిపిస్తుండటంతో అన్ని పార్టీలూ తమకు అనుకూలంగానే పోలింగ్ ఉంటుందని చెప్పుకుంటున్నాయి.
మరోవైపు రెండు రోజులుగా వర్షాలు కురిసి వాతావరణం చల్లగా మారడంతో .. పట్టణ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. ఉదయం ఏడు గంటలకే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. దీనికి తోడు గతంలో కంటే ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి రావడగంతో.. క్యూ లైన్ లన్నీ నిండిపోయాయి. అంతేకాదు అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజనులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉత్సాహంగా వస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY