వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాల కింద 4,536 మందికి రూ.38.18 కోట్లు పంపిణీ చేసిన సీఎం జగన్

AP CM YS Jagan Released Rs 38.18 Crore To 4536 Beneficiaries Under YSR Kalyanamasthu and Shaadi Tohfa Schemes,CM YS Jagan,YSR Kalyanamasthu,Shaadi Tohfa Schemes,Mango News,Mango News Telugu,Tdp Chief Chandrababu Naidu,Ap Cm Ys Jagan Mohan Reddy,Ys Jagan News And Live Updates, Ysr Congress Party, Andhra Pradesh News And Updates, Ap Politics, Janasena Party, Tdp Party, Ysrcp, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు మరియు భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు చెందిన ఆడ పిల్లల వివాహ ఖర్చుల నిమిత్తం ఆయా కుటుంబాలకు సాయమందించేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ‘వైఎస్సార్ కళ్యాణమస్తు’, వైఎస్సార్ షాదీ తోఫా’ పథకాలని రూపొందించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా శుక్రవారం ఈ పథకాల కింద అక్టోబర్-డిసెంబర్ 2022లో పెళ్లి చేసుకున్న 4,536 మంది లబ్దిదారులకు రూ.38.18 కోట్లను అందించింది. ఈ మేరకు సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుండి బటన్ నొక్కి వారి బ్యాంకు ఖాతాల్లో నగదును జమ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న లబ్ధిదారుల్లో కొందరు ముఖ్యమంత్రితో వర్చువల్‌గా సంభాషించారు. ప్రభుత్వం తరపున తమకు సాయం అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. బాల్య వివాహాలు నిరోధించడానికి మరియు స్కూల్ డ్రాపౌట్స్ అరికట్టడంతో పాటు ఆడ పిల్లల వివాహాలు తల్లిదండ్రులకు భారం కాకూడదన్న ఉద్దేశంతో ఈ పథకాలను రూపొందించామని పేర్కొన్నారు. దీనిలో భాగంగా, స్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు మరియు భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు వైఎస్సార్ కళ్యాణమస్తు పథకం ద్వారా, అలాగే మైనారిటీ వర్గాలకు వైఎస్సార్ షాదీ తోఫా పథకం కింద ఆర్ధిక సాయం అందిస్తున్నామని తెలిపారు. ఇక మైనారిటీలకు రూ.1లక్ష, బీసీల కులాంతర వివాహాలకు రూ.75,000, భవన నిర్మాణ కార్మికులకు రూ.40,000 అందిస్తున్నామని వివరించారు. ప్రతియేటా 4 విడతల్లో సాయం అందిస్తున్నామని, వివాహం అయిన ఒక నెలలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. కాగా ఈ పథకాల కింద అర్హత పొందేందుకు వధూవరులు మరియు వధూవరులు ఇద్దరూ 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, అలాగే వారి వయస్సు 18 మరియు 21 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదని సీఎం జగన్ స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + fifteen =