ఎన్నికల ప్రచార సమయంలో కన్నా.., ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ముగిశాక రాజకీయ వాతావరణం ఆసక్తికరంగా మారింది. అటు ఎన్డీఏ కూటమి.. ఇటు వైసీపీ.. గెలుపుపై ఏ పార్టీకి ఆ పార్టీయే ధీమాగా ఉంది. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్న నేతలు ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది తమ ప్రభుత్వమే అని భరోసా ఇస్తున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా పోలింగ్ తీరుపై స్పందించారు. జగన్ ఆత్మగౌరవాన్ని కాపాడాలన్న కారణంతోనే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చారని వెల్లడించారు. కానీ, ఓటమి అర్థంకావడంతో టీడీపీ శ్రేణులు అసహనంతో దాడులకు పాల్పడుతున్నాయని, వైసీపీ కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించాలని బొత్స పిలుపునిచ్చారు.
అంతటితో బొత్స ఆగలేదు.. మరో రెండు మూడ్రోజుల్లో సీఎం జగన్ పదవీ ప్రమాణ స్వీకారోత్సవం తేదీ, వేదికను కూడా ప్రకటిస్తామని వెల్లడించి ఆశ్చర్యపరిచారు. సీఎం జగన్ రెండో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం ఖాయమని, మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను 99 శాతం నెరవేర్చిన సీఎం జగన్ వెంటే ఏపీ ప్రజలు నిలిచారని చెప్పుకొచ్చారు. మరోవైపు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. ఏపీలో అరాచక, ఆటవిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోట్లాది ప్రజలు తరలి వచ్చి తమ తీర్పును వెలువరించారని అన్నారు. ఐదేళ్లు భరించి, ఓపిక నశించి, ఈ రాష్ట్రం బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డిని సాగనంపడమే మార్గం అని భావించిన ప్రజలు ఉదయం 5 నుండి అర్ధరాత్రి వరకు క్యూలో నిలబడి ఓట్లు వేశారని అంటున్నారు. “వైసీపీ సామ్రాజ్యంలో ఇష్టారీతిన చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నియంత పోకడ పోయిన ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి ప్రజలు అన్ని ప్రాంతాల నుండి ఒక ఉద్యమంలా పోరుబాట పట్టినట్లు ఓటు బాట పట్టారు. ఈ ఉద్యమంలో ఎన్డీయే కూటమి గెలవబోతుంది” అని జోష్యం చెప్పారు.
పార్టీ అగ్రనేత చంద్రబాబునాయుడు అయితే.. ఏపీలో క్వీన్ స్వీప్ చేయబోతున్నామని వెల్లడించారు. సోమవారం జరిగిన పోలింగ్ రాష్ట్రవ్యాప్తంగా తమకు పూర్తి అనుకూలంగా జరిగిందని, ఫలితాలు తమ కూటమికే ఏకపక్షంగా ఉండబోతున్నాయని వెల్లడించారు. అభిప్రాయపడుతున్నాయి. పోలింగ్ ముగిసిన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగిన తీరు, ప్రజలు స్పందించిన తీరు తదితర అంశాలపై టీడీపీ, జనసేన, బీజేపీ సమాచారం సేకరించాయి. దీంతోపాటు తమ నేతలు, ఇతరత్రా మార్గాల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా వివిధ నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితిని ఈ పార్టీల నాయకత్వాలు విశ్లేషించుకున్నాయి. వచ్చిన సమాచారంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.అసెంబ్లీతో పాటు.. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో రాజంపేట, నంద్యాల తప్ప మిగిలిన 23 సీట్లలో తాము ఆధిక్యం సాధించే అవకాశం ఉందని టీడీపీ నేతలు దీమాగా ఉన్నారు. మొత్తంగా జూన్ 4 తర్వాత ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది తామేనని ఇటు కూటమి, అటు వైసీపీ పేర్కొంటున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY