అయస్కాంత క్షేత్రం అదృశ్యమవుతుందా?

The Biggest Threat To The Earth?, The Biggest Threat, Magnetic Reversal, Magnetic Field, Invisibility Shield, Space From Earth's Interior, The Planet, Does The Magnetic Field Disappear?, Cosmic Threats to Life on Earth, Effects of Climate Change, Threats to the Earth's Biodiversity, Earth, Solar System, Mango News, Mango News Telugu
Magnetic reversal,Magnetic field,Invisibility Shield,Space from Earth's interior,the planet,the biggest threat to the earth?, Does the magnetic field disappear?

సమస్త జీవావరణానికి భూమే ఆధారమన్న విషయం చిన్నప్పటి నుంచీ అంతా చదువుకున్నాం. ఇంకా చెప్పాలంటే  మనకు తెలిసిన విశ్వంలో భూమి మాత్రమే జీవుల మనుగడకు అనుకూలంగా ఉంది. అందుకే భూమి మనకు తెలియకుండానే మనకు రక్షణ కల్పిస్తోందని శాస్త్రజ్ఞులు చెబుతూ ఉంటారు.

నిజానికి భూమి మధ్యలో కోర్ తిరగడం వల్ల.. భూమి చుట్టూ బాగా శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం ఒకటి ఏర్పడుతుంది. ఇది భూమిపైకి సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన అణువులను, కాస్మిక్ రేస్‌ను తిప్పికొట్టడంలో ఇది  కీలక పాత్ర పోషిస్తోంది. భూమికి ఉండే ఈ మాగ్నటిక్ క్షేత్రం సౌర తుఫానులు, సౌర జ్వాలల నుంచి కూడా జీవావరణాన్ని రక్షిస్తోంది. ఇది ఒక బుడగలాగా భూమి నుంచి కొన్ని లక్షల కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంటుంది.

అయితే ప్రస్తుతం సైంటిస్టులు చెబుతున్నదాని ప్రకారం.. భూమి యొక్క  అయస్కాంత ధృవాలు మారుతున్నాయని తెలుస్తోంది. ఇలా ఉత్తర, దక్షిణ ధృవాలు పరస్పరం మారుతున్నట్లు సమాచారం. 1990 వరకు ఉత్తర ధృవం ఏడాదికి 15 కి.మీటర్ల వేగంతో కదలగా… ఆ తర్వాత సంవత్సరాల్లో మాత్రం  ఈ రేటు ఏడాదికి 55 కి.మీటర్ల మేర సైబీరియా వైపు పెరిగినట్లు సైంటిస్టులు గుర్తించారు.

ఈ కదలిక వల్ల ఉత్తర, దక్షిణ ధృవాల స్థానాలను మార్చగలిగే ”మాగ్నెటిక్ రివర్సర్”కి దారి తీయవచ్చని అంచనా వేస్తున్నారు.  83 మిలియన్ ఏళ్లలో ఇలా 183 సార్లు జరిగినట్లు నాసా సైంటిస్టులు చెబుతున్నారు. అయితే, ఈ ప్రక్రియ మధ్య జరిగే సమయాలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయని.. సగటున దాదాపు 3,00,000 ఏళ్లకు ఒకసారి ఇలా మాగ్నెటిక్ రివర్సల్ అనేది చోటు చేసుకున్నట్లు సైంటిస్టులు అంటున్నారు. ఈ ప్రక్రియ జరిగే టైములో అంటే.. ఒకానొక దశలో ధృవాలు మారే సందర్భంలో ఈ  మాగ్నెటిక్ ఫీల్డ్ జీరో అవుతుందట.

భూమి యొక్క మేగ్నటిక్ ఫీల్డ్ సమస్త జీవులను, సాంకేతిక వ్యవస్థలను రక్షించడంలో కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ ఇన్‌విజుబిలిటీ షీల్డ్ భూమి యొక్క అంతర్భాగం నుంచి స్పేస్‌లోకి విస్తరించి, ఒక రక్షిత బుడగను ఏర్పరుస్తుంది. సూర్యుని నుంచి వెలువడే ఆవేశిత కణాల ప్రవాహం నుంచి ప్లానెట్‌ను కాపాడుతుంది. అయితే ఈ కీలకమైన మేగ్నటిక్ ఫీల్డ్ అదృశ్యమైతే మాత్రం విపరీత పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందట.

ముఖ్యంగా మనుషుల ఆరోగ్యంతో పాటు, పర్యావరణం, సాంకేతికత  కూడా దెబ్బతింటుందట.  అయస్కాంత క్షేత్రం అదృశ్యమవడం వల్ల ప్రాణాంతక రేడియేషన్ సూటిగా భూమిని చేరుతుంది. దీని ద్వారా జీవ కణాల మ్యుటేషన్ రేటు పెరిగి.. జంతువుల్లో కూడా క్యాన్సర్‌లకు దారి తీస్తుంది. వాతావరణం చాలా తీవ్రంగా దెబ్బతింటుందట.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY