ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల క్రతువులో చిట్టచివరి అతి పెద్ద ఘట్టం అట్టహాసంగా ముగిసింది. టీడీపీ నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సుమారు 12 ఎకరాల సువిశాల ప్రాంగణంలో పూల పల్లకి లాంటి వేదికపై ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు రాజకీయ అతిరథ మహారధులు.. చిరంజీవి వంటి సినీ సెలబ్రిటీలు,ఇతర ప్రముఖుల మధ్య లక్షలాది మంది ప్రజల జయజయ ధ్వానాల మధ్య నారా చంద్రబాబు నాయుడు అనే నేను అంటూ ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు.
దీని తర్వాత జనసైనికులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనసేనాని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ప్రధాన ఘట్టం కూడా ముగిసింది. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసాక.. జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న సందర్భంలో..కొణెదల పవన్ కళ్యాణ్ అనే నేను అని పవన్ చెప్పగానే.. సభా ప్రాంగణం మొత్తం పవన్ కళ్యాణ్ పేరుతో మారు మోగింది.
జనసైనికులే కాకుండా కూటమి కార్యకర్తలు, నేతలు కూడా తమతమ కండువాలు ఎగురేస్తూ పవన్ పేరు ఉచ్చరించడం అక్కడ ప్రత్యేకత సంతరించుకుంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి, పవన్ భార్య అన్నా లెజ్నివా సంతోషాన్ని వ్యక్తం చేయడాన్ని కూడా మీడియా బాగా హైలెట్ చేసింది. మొత్తంగా కొన్నాళ్లుగా ఏపీ రాజకీయాలతో దేశవ్యాప్తంగా ఉర్రూతలూగించిన పవన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయన అభిమానులతో పాటు ఆయనపై ఎన్నో అంచనాలు పెంచుకున్న ఏపీ ప్రజలు కూడా సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పదవి రాకుండా చేసిన మంచిపనులు ఎన్నో ఉన్నా కూడా.. చేతిలో పవర్ ఉంచుకున్న పవన్ రాజకీయం ఎలా ఉంటుందో చూడాలని ఇటు రాజకీయ విశ్లేషకులు సైతం ఆసక్తిని కనబరుస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE