వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చిన అంశాల్లో అన్నా క్యాంటీన్లు తొలగించడం ఒకటి. 2014 లో టీడీపీ అధికారంలోకి వచ్చాక పేదల కడుపు నింపాలని రాష్ట్రవ్యాప్తంగా మహనీయుడు ఎన్టీ రామారావు పేరుతో అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. నిరుపేదలకు, కూలీల కడుపు నింపేందుకు కేవలం 5 రూపాయలకే నాణ్యమైన భోజనాన్ని అందించారు. పెద్ద సంఖ్యలో పేదలు, కూలీలు, కార్మికులు అన్నా క్యాంటీన్ల ద్వారా కడుపు నింపుకునే వారు. తక్కువ సమయంలోనే అన్నా క్యాంటీన్లను విశేష ఆధరణ లభించింది.
కానీ 2019లో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్నా క్యాంటీన్లను తొలగించేశారు. కొన్ని ఏరియాల్లో అన్నా క్యాంటీన్లను కూల్చేశారు. మరికొన్నింటిని వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలకు.. ఇతర కార్యాలయాలకు ఉపయోగించారు. దీంతో అప్పట్లో వైసీపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. పలు ఏరియాల్లో పేదలతో కలిసి టీడీపీ నేతలు ర్యాలీలు, ధర్నాలు కూడా చేశారు. ఇక మరికొన్ని ఏరియాల్లో టీడీపీ నేతలు తమ సొంత డబ్బులతో అన్నా క్యాంటీన్లను కొంతకాలంగా నడింపించారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోయింది. తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. బుధవారం ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. ఈక్రమంలో త్వరలోనే అన్నా క్యాంటీన్లు రాష్ట్రవ్యాప్తంగా తిరిగి ఓపెన్ కానున్నాయి. మళ్లీ పేదలకు అన్నా క్యాంటీన్ల ద్వారా నాణ్యమైన భోజనం అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే తొలి అన్నా క్యాంటీన్ హిందూపురంలో ఓపెన చేశారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా రెండు రోజుల క్రితం అక్కడ క్యాంటీన్‌ను ప్రారంభించారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE