మౌనం వహించిన ముద్రగడ.. ఎందుకంటే?

AP Politics, Mudragada padmanabham, Janasena, YCP, AP Elections, TDP, Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, TDP Chief Chandrababu Naidu,Janasena Chief Pawan Kalyan, andhra pradesh, Pawan latest news, Mango News Telugu, Mango News
AP Politics, Mudragada padmanabham, Janasena, YCP, AP Elections

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. మొన్నటి వరకు కూడా ఆయన వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్. ఆయన రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారని.. వైసీపీలో చేరబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ తర్వాత సడెన్‌గా జనసేన వైపు ముద్రగడ చూస్తున్నారని.. త్వరలోనే జనసేన కండువా కప్పుకుంటారని సోషల్ మీడియా కోడై కూసింది. ఇలా మొన్నటి వరకు ముద్రగడకు సంబంధించిన వార్తలతో ఏపీ రాజకీయాలు అట్టుడికిపోయాయి. అందరూ ఆయన ఏపార్టీలోకి వెళ్తారని ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు. కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా ముద్రగడ మౌనం దాల్చారు. దీంతో ఎందుకు ముద్రగడ అలా మౌనదీక్ష చేస్తున్నారని జనాలు చర్చించుకుంటున్నారు.

కొద్దిరోజుల క్రితం తన నివాసంలో ముద్రగ పద్మనాభం తన సన్నిహితులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయాల్లోకి రీ ఎంట్రీపై వారితో చర్చించారు. దీంతో ఎన్నికల ముందు ముద్రగడ రాజకీయాల్లోకి ఎంట్రీ వీర లెవల్‌లో ఉంటుందని అంతా భావించారు. అనుకున్నట్లుగానే ముందుగా అధికార వైసీపీతో ముద్రగడ చర్చలు జరిపారు. అటు వైసీపీ కీలక నేతలు కూడా కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. వైసీపీ హైకమాండ్ పలు భారీ ఆఫర్లు కూడా ముద్రగడకు ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. దీంతో వైసీపీలో ముద్రగడ చేరడం ఖాయమని అంతా అనుకున్నారు.

కానీ సడెన్‌గా కొత్త వార్త తెరపైకి వచ్చింది. ముద్రగడ జనసేనలో చేరబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే అంతకంటే ముందు జనసేన వారాహి యాత్రపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ముద్రగడ.. ఇప్పుడు అదే పార్టీలో చేరడం ఏంటని అంతా అనుకున్నారు. అదే సమయంలో పలువురు జనసేన నేతలు స్వయంగా ముద్రగడ ఇంటికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. పార్టీలోకి ఆహ్వానించారు. అయితే పవన్ తన ఇంటికి వచ్చి మాట్లాడితే పార్టీలో చేరుతానని ముద్రగడ అనడంతో.. అటు పవన్ కూడా తన ఇంటికి వెళ్లి కలుస్తానని ప్రకటించారు.

సంక్రాంతి తర్వాత ముద్రగడ పద్మనాభంను పవన్ కలుస్తారని అంతా అనుకున్నారు. ఆ తర్వాత జనవరి నెలాఖరులో కలుస్తారని ప్రచారం జరిగింది. కానీ జనవరి నెల అయిపోయి.. ఫిబ్రవరి మొదటి వారం కూడా అయిపోవస్తున్నప్పటికీ.. వారిద్దరి కలయిక జరగలేదు. అదే సమయంలో ముద్రగడ సైలెంట్ అయిపోయారు. అయితే తనకు, తన కుమారుడితో పాటు తన అనుచరులకు ముద్రగడ టికెట్ ఆశిస్తున్నారు. కానీ అటు ఇప్పటి వరకు కూడా టీడీపీ-జనసేనల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తిగా జరగలేదు. ఒకవేళ జనసేనకు తక్కువ సీట్లు దక్కితే.. తాను ఆశించినన్ని స్థానాలు దక్కుతాయో.. లేదో అనే సందేహంలో ఉన్నారట ముద్రగడ. అందుకే జనసేనలోకి ఆయన చేరిక ఆగిపోయిందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మరి ముందు ముందు ముద్రగడ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − eight =