ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన టీమ్‌ను ఏరికోరి ఎంచుకుంటున్నారు. పవన్‌కు రాజకీయంగా అవగాహన ఉన్నప్పటికీ.. పాలనాపరంగా అవగాహన తక్కువ. అందుకే ఆ విషయంలో మరింత పట్టు కోసం సమర్థవంతమయిన టీమ్‌ను ఎంచుకుంటున్నారు. అన్ని విషయాల్లో పట్టు, మంచి అవగాహన, ఎటువంటి అవినీతి మచ్చలేని అధికారులను ఏరికోరి తన టీమ్‌లోకి తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా తన ఓఎస్‌డీ(ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా కేరళలో పనిచేస్తున్న ఏపీకి చెందిన యువ ఐఏఎస్ అధికారి మైలవరపు వీఆర్ కృష్ణతేజను ఎంపిక చేసుకున్నారు.
పల్నాడు జిల్లా చిలకలూరి పేటకు చెందిన కృష్ణతేజ.. 2015 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారం. ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తన అద్భుత పనితీరుతో తనదైన ముద్ర వేసుకున్నారు. 2023 మార్చిలో కృష్ణతేజ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం కేరళలోని త్రిసూర్ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. గతంలో కేరళ పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ, పర్యాటకశాఖ డైరెక్టర్, ఎస్సీ అభివృద్ధిశాఖ డైరెక్టర్, అలప్పుజ జిల్లా కలెక్టర్‌గా సేవలందించారు. కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన 609మది పిల్లలకు దాతల సహకారంతో ఉన్నత చదువులకు చేయూతనందించారు.
పవన్ కళ్యాణ్‌కు కృష్ణతేజకు మధ్య ఎప్పటి నుంచో పరిచయం ఉంది. కృష్ణతేజ మైండ్ సెట్ పవన్ కళ్యాణ్‌కు బాగా తెలుసు. ఏ పదవిలో ఉన్నా దానికి వంద శాతం కృష్ణ తేజ న్యాయం చేస్తుంటారు. అాగే క్లిష్ట సమయాల్లో ఎలా వ్యవహరించాలి, సమస్యల్ని ఎలా అధిగమించాలి అనే అంశాలు ఆయనకు బాగా తెలుసు. అందుకే కృష్ణతేజను తన టీమ్‌లోకి తీసుకోవడం ద్వారా పాలనాపరమైన అంశాల్లో సరైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలుంటుందని పవన్ భావిస్తున్నారు. అందుకే తన ఓఎస్‌డీగా కృష్ణతేజను పవన్ ఏరికోరి ఎంచుకున్నారు.
సాధారణంగా ఆర్డీఓ స్థాయి అధికారులను మంత్రులకు ఓఎస్‌డీలుగా నియమిస్తారు. కానీ వవన్ కృష్ణతేజను తన టీమ్‌లోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉండడంతో అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక అనుమతి ఇచ్చారట. అంతేకాకుండా ఇందుకోసం కేంద్రానికి లెటర్ కూడా రాశారు. కేరళలోని త్రిసూర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న కృష్ణతేజను డిప్యుటేషన్‌పై ఏపీకి పంపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు కోరారు. త్వరలోనే కృష్ణతేజ డిప్యుటేషన్‌పై ఏపీకి రానున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY