హైదరాబాద్ పోష్ కల్చర్‌ను అడాప్ట్ చేసుకున్న సిటీల్లో టాప్ లిస్ట్‌లోకి ఎప్పుడో చేరిపోయింది. దీనికి హైదరాబాద్‌లో నివసిస్తున్న వారి లివింగ్ హ్యాబిట్స్ తో పాటు నైట్ షాపింగ్, యూత్ నైట్ అవుట్‌లు కూడా కారణమే. అయితే అలాంటి హైదరాబాద్ లో రెండు రోజులుగా వినిపిస్తున్న ఓ వార్త నగరవాసులతో పాటు దుకాణదారులను కూడా హడలెత్తిస్తుంది.
తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగరంలోని శాంతి భద్రతల గురించి ఓ మీటింగ్ పెట్టారని ..అందులో రాత్రి పూట పెరుగుతున్న నేరాలను అదుపులో ఉంచడానికి లేట్ నైట్ షాపింగ్ లు కూడా కారణమని నిర్ణయానికి వచ్చినట్లు ఓ వార్త హల్ చల్ చేసింది. అంతేకాదు దీనికి చెక్ పెట్టడానికి అందుకే రాత్రి పదిన్నర తర్వాత మాల్స్ కానీ, స్ట్రీట్ ఫుడ్స్ కానీ, షాపులు కానీ అన్నిటిని బంద్ చేయించాలని పోలీసులకు సీఎం ఆదేశాలు ఇచ్చిన వార్త పెద్ద ఎత్తున వైరల్ అయింది. దీనిపై పోలీసులు యాక్షన్ సీన్లోకి దిగిపోయినట్లు కూడా వార్తలు వినిపించాయి.
హైదరాబాదులో అన్ని దుకాణాలు, షాపింగ్ సెంటర్లను రాత్రి 10:30 గంటలకు మూసివేస్తున్నారన్న వార్తతో నగర వాసులు కాస్త ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా బ్యాచిలర్స్, ఉద్యోగస్తులు సెకండ్ షిప్ట్ ముగిసాక తామెక్కడ తినాలని కామెంట్లు పెడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది వ్యాపారులకు కూడా పెద్ద దెబ్బ అని చాలామంది వాపోయారు.
అయితే ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా అవడంతో హైదరాబాద్ పోలీస్ శాఖ రంగంలోకి దిగడమే కాదు..ఇలా జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున జరుగుతున్న దుకాణాల బంద్ ప్రచారాన్ని ఖండించిన హైదరాబాద్ సిటీ పోలీసులు అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చారు. ఎప్పటిలానే అమలులో ఉన్న నిబంధనల ప్రకారమే..హైదరాబాద్ లో రాత్రిపూట షాపులు, ఇతర దుకాణాలు తెరిచి ఉంటాయని పోలీసులు అన్నారు. ఇలాంటి ఫేక్ న్యూస్‌లను క్రియేట్ చేసిన వాళ్లను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE