పీవీ రికార్డును బ్రేక్ చేసిన శ్రీధర్ బాబు.. ఐటీ శాఖ ఆయనకేనా..?

Sridhar Babu who broke the PV record IT department belongs to him,Sridhar Babu who broke the PV record,IT department belongs to him,Sridhar Babu record IT department,duddilla sridhar babu, IT Ministry, Telangana, IT, Congress,Mango News,Mango News Telugu,Sridhar Babu Latest News,Sridhar Babu Latest Updates,Sridhar Babu Live News,IT Ministry Latest News,Duddilla sridhar babu Latest News
duddilla sridhar babu, IT Ministry, Telangana, IT, Congress

తెలంగాణకు గుండెకాయ ఐటీ శాఖ. రాష్ట్రానికి అత్యధిక ఆదాయం వస్తుంది ఈశాఖ నుంచే. అలాగే మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే.. తెలంగాణలో ఐటీ రంగం దూకుడుగా ముందుకెళ్తోంది. దీనికి కారణం ఎవరు అని ఎవరిని అడిగినా చెప్పే పేరు కేటీఆర్. అవును.. తెలంగాణలో ఐటీ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించారు కేటీఆర్. గూగుల్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు హైదరాబాద్‌కు క్యూ కట్టాయి అంటే.. అదంతా కేటీఆర్ చలువే. కానీ ఇప్పుడు తెలంగాణలో  కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరబోతోంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రి ఎవరు అనేది ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది.

అయితే కాబోయే ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అంటూ ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. శ్రీధర్ బాబుకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండడంతో పాటు.. ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తి. ఇప్పటికే శ్రీధర్ బాబు పాతతరం పాలిటిక్స్‌ను ఫాలో అవుతూ.. వివాదాలకు దూరంగా ఉంటున్నారు. అలాగే ఉన్న కాంగ్రెస్ నేతల్లో ఐటీ శాఖను  సమర్థవంతంగా నిర్విహించే సత్తా ఉన్న వ్యక్తి ఆయన ఒక్కరే. ఐటీ శాఖను మరో మెట్టు ఎక్కించాలంటే ఆయన ఇక్కరితోనే సాధ్యం. అందుకే శ్రీధర్ బాబుకే ఐటీ శాఖను కట్టబెట్టనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇకపోతే ఈ ఎన్నికల్లో దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఘన విజయం సాధించారు. 30 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయ ఢంకా మోగించారు. అయితే ఈ విజయంతో దుద్ధిళ్ల శ్రీధర్ బాబు సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు రికార్డును బ్రేక్ చేశారు. ఇప్పటి వరకు ఉమ్మ కరీంనగర్ జిల్లా నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేత ఎవరూ లేరు. మంథని నియోజకవర్గం నుంచి పీవీ నరసింహారావు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

అయితే ఈ ఎన్నికల్లో గెలుపొంది శ్రీధర్ బాబు సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నేతగా చరిత్ర సృష్టించారు. 1999, 2004, 2009, 2018, 2023లో శ్రీధర్ బాబు మంథని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది సరికొత్త చరిత్ర సృష్టించారు. అటువంటి నేతకు ఐటీ శాఖను కట్టబెడుతారా..? లేదా..? రేవంత్ రెడ్డి నిర్ణయం ఎలా ఉండబోతోంది.. అనేది చర్చనీయాంశంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × three =