అకాలవర్షం, వడగళ్లతో ఉద్యాన, వ్యవసాయ పంటల నష్టం తీవ్రతను పరిశీలించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు

CM KCR Orders to Examine Severity of Damage to Horticulture and Agricultural Crops due to Untimely Rain and Hail,CM KCR Orders to Examine Severity,Damage to Horticulture and Agricultural Crops,CM KCR on Untimely Rain and Hail,CM KCR Orders on Damage to Horticulture and Agriculture,Mango News,Mango News Telugu,CM KCR News And Live Updates,Rain of Crushed Stones,CM KCR Hyderabad Heavy Rains News,Hyderabad IMD Issues Yellow Alert,Hyderabad Rains Latest Updates,CM KCR News And Live Updates,Telangana Horticulture and Agriculture Latest News,Telangana Horticulture and Agriculture Live News

అకాలవర్షం, వడగళ్ల వానతో వికారాబాద్ జిల్లా మర్పల్లి, మోమిన్ పేట మండలాలలోని 13 గ్రామాలలో ఉద్యాన, వ్యవసాయ పంటలకు నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో ఉద్యాన, వ్యవసాయ పంటల నష్టం తీవ్రతను పరిశీలించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలు ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆ ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

వికారాబాద్ జిల్లా మర్పల్లి, మోమిన్ పేట మండలాలలో వడగళ్ల వాన తీవ్ర ప్రభావం చూపి పంటనష్టం కలిగించినట్లు ప్రాథమిక సమాచారం. మామిడి, గులాబీ, ఉల్లిగడ్డ, బొప్పాయి వంటి ఉద్యాన, కొంతమేర మొక్కజొన్న వంటి వ్యవసాయ పంటలు దెబ్బతిన్నట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలో ప్రత్యక్షంగా పంటనష్టం తీవ్రతను పరిశీలించి, మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రైతులకు భరోసా కల్పించనున్నారు. ఈ పర్యటనలో మంత్రితో పాటు ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు కూడా పాల్గొంటారు. ఈ మేరకు తెలంగాణ సీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 15 =