సీజనల్ ఫ్రూట్స్‌కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అందులోనూ కొన్ని పండ్లు అయితే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ యమా క్రేజ్ ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఆ పండ్లు వస్తాయా అనేంతగా ఉంటాయి. ఇలాంటి వాటిలో లిచీ ఎప్పుడూ టాప్ లోనే ఉంటుంది. ఒకప్పుడు ఏజెన్సీ ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలలో మాత్రమే కనిపించే లిచీ ఇప్పుడు భారత్‌లో చాలా ప్రాంతాలలో ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలలో ఎక్కువగా కనిపిస్తున్నాయి.
లిచీలో పోషకాలు పుష్కలంగా ఉండటంతో పాటు.. చూడడానికి కూడా కూడా ఆకర్షనీయంగా ఉంటాయి. మంచి రుచితో పాటు గుండ్రని ఆకారం, మెరిసే చర్మంతో ఉండే లిచీని చూడగానే వెంటనే తినాలి అన్న కోరికను కలిగిస్తుంది. తీయగా, జ్యూసీగా, గుజ్జుతో సమృద్ధిగా ఉంటుంది.
లిచీలో విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పురాతన కాలం నుంచీ కూడా లిచీని చైనాలో ఔషధంగా ఉపయోగించినట్లు అధ్యయనాలు చెబుతున్నారు. లిచీ అతిపెద్ద ఉత్పత్తిదారు చైనా దేశమే. చైనాతో పాటు దీనిని దక్షిణ ఆసియా ప్రాంతంలో విస్తృతంగా సాగు చేస్తారు. భారత్, థాయిలాండ్, వియత్నాం వంటి ఆసియా దేశాలలో లిచీని ఇప్పుడు ఎక్కువగా సాగు చేస్తున్నారు.
లిచీలో యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉండటంతో..ఇవి బాడీలోని మంచి కణాలను దెబ్బ తినకుండా కాపాడతాయి. అంతేకాకుండా కొన్ని వ్యాధుల నుంచి కూడా ఇవి రక్షిస్తాయని నిపుణులు అంటున్నారు. లిచీలో పొటాషియం, విటమిన్- సి, విటమిన్- ఇ, ఐరన్, ఫైబర్, మాంగనీస్, ఫాస్పరస్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల జీవక్రియ బలపడుతుంది. అయితే లిచీని ఎలా పడితే అలా తింటే అది శరీరానికి హాని చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఖాళీ కడుపుతో లిచీ పండ్లను తినడం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురవుతారట. ఎందుకంటే లిచీలో ఉండే హైపోగ్లైసిన్ A, మిథైలిన్ సైక్లోప్రొపైల్ గ్లైసిన్ .. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. దీంతో బాడీలో షుగర్ లెవెల్స్ పడిపోతాయి. అంతేకాదు లిచీ వేడి చేసే స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి వీటిని తినడానికి అరగంట ముందు నీటిలో నానబెట్టి ఉంచాలని నిపుణులు చెబుతున్నారు. దీన్ని కొన్న వెంటనే నీటిలో వేయకుండా తింటే కడుపులో వేడి పెరిగి.. శరీరంలో దద్దుర్లు వస్తాయి. అలాగే ఇలాంటి లిచీ తినడం వల్ల కడుపు నొప్పి కూడా వస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ