పార్లమెంట్ లో అధికార, విపక్షాల మధ్య వార్… 

War Between Ruling Party Leaders And Opposition Party Leaders In Parliament, War Between Ruling Party Leaders And Opposition Party Leaders,Opposition Party Leaders,Ruling Party Leaders,War,Parliament,modi, rahul gandhi,Politics, Political News,PM, Lok Sabha elections,Lok Sabha Election Results 2024,Lok Sabha Election Results,Mango News,Mango News Telugu
ruling party leaders, opposition party leaders, Parliament, modi, rahul gandhi

గత ఎన్నికల్లో ఇండియా కూటమి ప్రదర్శన ఇప్పుడు కొత్త పార్లమెంట్ లో స్పష్టంగా కనిపిస్తోంది. పెరిగిన విపక్షం దెబ్బ బీజేపీ కి, మోడీకి గట్టిగానే తగులుతోంది. మోడిని ఓడించడం ఎవరి తరం కాదు అనుకున్న తరుణంలో ఇండియా కూటమి అద్భుతమైన ప్రదర్శన చేసింది. తమకు వచ్చిన సీట్ల తో పార్లమెంట్ సమావేశాల్లో ఇండియా కూటమి చెలరేగిపోతోంది. గత రెండు పర్యాయాలు నిలదొక్కుకోవడానికే కాంగ్రెస్ పార్టీకి  సమయం సరిపోయింది. కాని ఇప్పుడు బలమైన ప్రతిపక్షం నాయకుడిగా పార్లమెంట్ లో అడుగుపెట్టిన రాహుల్ గాంధీ బీజేపీపై ఏకధాటిగా విమర్శలు చేస్తున్నాడు. మొదట ప్రొటెం స్పీకర్ ఎన్నిక పై ఇండియా కూటమి గళంవవిప్పింది.  8 సార్లు గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కాకుండా 7 సార్లు గెలిచిన బీజేపీ అభ్యర్థి భర్తృహరి కి ఎలా ఇచ్చారంటూ ప్రశ్నిస్తూ….ప్రొటెం స్పీకర్ కి సహకరించే ప్యానెల్ నుంచి ఇండియా కూటమి నాయకులు బయటకు వచ్చారు. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక పదవికి ఒత్తిడి తీసుకువచ్చింది. డిప్యూటీ స్పీకర్ తమకు ఇస్తేనే స్పీకర్ పదవి ఏకగ్రీవానికి అంగీకరిస్తామన్నారు. అధికార పార్టీ ఇవ్వకపోవడంతో ప్రతిపక్షం స్పీకర్ పదవికి పోటీ పడింది. కానీ ఓటింగ్ కు అడగలేదు. అలాగే కొత్త స్పీకర్ ను సాంప్రదాయ బద్దంగా ప్రధాన మంత్రితో పాటు ప్రధాన ప్రతిపక్ష నేత మోడీకి కరచాలనం చేసి స్పీకర్ ను స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టారు. దాని తర్వాత నీట్ పరీక్షపై సమర్థవంతంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే దీనికి కౌంటర్ గా ఎమర్జెన్సీ అంశాన్ని ఎన్డీయే నాయకులు లేవనెత్తారు.

ఇక సోమవారం నాడు రాహుల్ గాంధీ మరింత చెలరేగిపోయాడు. రాహుల్ గాంధీ మాట్లాడేందుకు లేచి నిలబడితే బీజేపీ సభ్యులు ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో రాహుల్ గాంధీ ‘జై రాజ్యాంగం’ అంటూ స్పందిస్తూ… రాజ్యాంగం కాపీని, దేవుడు, ప్రవక్త ముహమ్మద్, జీసస్ క్రైస్ట్ మరియు గురునానక్‌తో సహా మత పెద్దల ఫోటోలను ప్రదర్శించిన రాహుల్ గాంధీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంస్థలు హిందువులందరికీ ప్రాతినిధ్యం వహించడం లేదని విమర్శించారు. హిందువులంటే బిజెపి, ఆర్ఎస్ఎస్ మాత్రమే కాదన్నారు. ఇక మరో అడుగు ముందుకేసి హిందువులమని చెప్పుకునేవారు మాత్రం 24 గంటలూ హింస, ద్వేషం అంటున్నారని… మీరు అసలు హిందువులే కాదు, సత్యాన్ని సమర్థించాలని హిందూమతంలో స్పష్టంగా రాసి ఉందన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై అధికార కూటమి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు చాలా తీవ్రమైనవని హిందూ సమాజాన్ని మొత్తం హింసాత్మకం అని పేర్కొనడం తీవ్రమైన విషయమన్నారు. తర్వాత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీజీ అంటే సంపూర్ణ హిందూ సమాజం కాదు.. బీజేపీ అంటే సంపూర్ణ హిందూ సమాజం కాదు.. ఆర్‌ఎస్‌ఎస్‌ అంటే పూర్తి హిందూ సమాజం కాదు అని అన్నారు.

ప్రతిపక్ష పార్టీలో కూర్చున్నందుకు సంతోషంగా, గర్వంగా ఉంది. ఇది మన శక్తికి మించినది. ఇది నిజం. దేవుడు నేరుగా మోడీ ఆత్మతో సంభాషిస్తాడు. మిగిలిన మనం పుట్టి చనిపోయే సాధారణ జీవ జీవులమని రాహుల్ వ్యగ్యంగా విమర్శించారు. బీజేపీ విధానాలు, రాజకీయాలు మణిపూర్‌ను తగలబెట్టాయి, ఇంత జరిగిన ప్రధాని మోదీ ఇప్పటి వరకు ఆ రాష్ట్రానికి వెళ్లలేదన్నారు. నోట్ల రద్దు, బలహీనమైన జీఎస్టీ కారణంగా ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం వెన్నెముక విరిగిపోయింది. రైతులు ఎంఎస్‌పికి చట్టపరమైన హామీని కోరుతున్నారు. కానీ ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగా లేదు. నీట్ విద్యార్థులు ఈరోజు పరీక్షలపై నమ్మకం కోల్పోయారు. ఎందుకంటే పరీక్షలు ధనవంతులకే తప్ప అర్హులకు కాదని వారికి అర్థమైంది. ప్రతిపక్షం మీ శత్రువు కాదు. మీ పనిని సులభతరం చేయడానికి మేము ఇక్కడ ఉన్నాము. అభయ ముద్రే కాంగ్రెస్‌కు చిహ్నం. ఇది హిందూ మతం, ఇస్లాం, సిక్కు మతం, బౌద్ధమతం మరియు ఇతర భారతీయ మతాల్లోని భద్రతా భావం భయాన్ని పోగొట్టి, రక్షణను అందిస్తుందన్నారు రాహుల్ గాంధీ. ఏది ఏమైనా గత రెండు పర్యాయాలు మాదిరిగా కాకుండా పార్లమెంట్ లో బలమైన ప్రతిపక్షం ఉండటంతో రాబోవు ఐదేళ్లు సమావేశాలు వాడీ వేడీగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY