ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నాడా..? ముఖ్యంగా బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసిన టీడీపీ ఇప్పుడు ఎంత వరకు ఉద్యోగ కల్పనపై దృష్టి పెడుతోంది. కూటమి పాలన లోనైనా యువతకు ఉద్యోగాలు వస్తాయా… ఇప్పుడు ఇదే ఏపీ యువత మదినిండా ఉన్న ఆలోచనలు.. ఆలోచనలే కాదు వారికి ఆశలు కూడా ప్రభుత్వం కల్పించే ఉద్యోగాల పైనే. మరి ఆ దిశగా ఏపీ ప్రభుత్వం ఎంత మేరకు అడుగులు వేస్తుందా అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే యువతకు తమకు ఉద్యోగాలు వస్తాయని నమ్ముతున్నారు.
ఎన్నికల్లో భారీ విజయంతో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం. అధికారం చేపట్టగానే ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించింది. ముందుగా టీడీపీ హామీ ఇచ్చిన 7 వేల రూపాయల పెన్షన్ ని అమలు చేసి చూపింది. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని కూడా ఈ నెల చివరకు అమలు చేయనుంది. అయితే అన్నింటికన్నా ముఖ్యమైనది నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన. వైసీపీని తిరస్కరించి చంద్రబాబుకు ఏపి ప్రజలు పట్టం కట్టడం లో ప్రధాన పాత్ర పోషించింది యువతే. గత పాలనలో ఉద్యోగాలు రాకపోవడంతోనే చంద్రబాబుకు పట్టం కట్టారు యువత. టీడీపీ సైతం బాబు వస్తే జాబు వస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే చంద్రబాబు నాయుడు డీఎస్సీ పై సంతకం కూడా చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్ కు సంబంధించిన కసరత్తు కూడా జరుగుతోంది. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగాలే కాదు ప్రైవేటు ఉద్యోగాలు వస్తేనే అందరికి ఉపాధి లభిస్తుంది. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువత సామర్థ్యాన్ని మరియు ఉపాధిని అంచనా వేయడానికి ప్రభుత్వం నైపుణ్య గణనను చేపడుతుందని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. జూన్ 13న జీవో 13 ద్వారా నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణా విభాగాన్ని ఏర్పాటు చేయాలనే ఉత్తర్వులపై సంతకం చేసాడు. దీంతో ఆంధ్రప్రదేశ్ యువతలో ఆశలు చిగురించాయి.
ఇక గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో నూతన పరిశ్రమలను ఆహ్వానించడం పైనే చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. బెల్జియం రాయబారి దిదీర్ వాండర్ హాస్టల్ నేతృత్వంలో వచ్చిన ఆ దేశ వాణిజ్య, పరిశ్రమల విభాగం ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని పెట్టుబడులతో రాష్ట్రానికి రావాలని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. ఇక శ్రీ సిటీలోని వెర్మీరెన్ సంస్థ 100 కోట్ల తో పరిశ్రమను విస్తరించేందుకు అంగీకరించినట్లు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ.భరత్ తెలిపారు. ఇక అచ్యుతాపురం 183 కోట్ల తో ఏఐ ఉత్పత్తులను తయారు చేసే సంస్థ రానుంది. ఆ సంస్థ ద్వారా దాదాపు 5 వేల మందికి ఉపాధి దక్కనుంది. ఇక టెస్లా తో పాటు మరి కొన్ని దగ్గజ కంపెనీలకు ప్రభుత్వ అధికారులు లేఖలు రాశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనువైన వాతావరణాన్ని వివరిస్తున్నారు. గతంలొ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన కొన్ని సంస్థలు వైకాపా ప్రభుత్వ హయాంలో వివిధ కారణాలతో తమ ప్రతిపాదనలను ఉపసంహరించుకున్నాయి. వాటిలో మరెక్కడా పెట్టుబడులు పెట్టని సంస్థలను గుర్తించి, రాష్ట్రానికి రావాలంటూ వాటికి లేఖలు పంపుతున్నట్లు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇలా ఏపీకి భారీగా పరిశ్రమలను తీసుకువచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.
ఇక రాష్ట్రంలో 21 వేల మందికిపైగా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఏపీసీసీ అధ్యక్షురాలు, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఎన్నికల సందర్భంగా గట్టిగానే లేవనెత్తారు. అయితే ఇప్పుడు ప్రస్థుత ప్రభుత్వ పాలనలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆ పరిస్థి ఉండకపోవచ్చని త్వరలోనే తమకు ఉద్యోగాలు వస్తాయని యువత బలంగా నమ్ముతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE