ఎన్నికలంటేనే హాట్ టాపిక్.. నలుగురు గుమిగూడారంటే పాలిటిక్స్, ఎలక్షన్స్ గురించి కచ్చితంగా మాట్లాడుకుంటారు. మొన్నటి వరకు తెలంగాణ, ఏపీ, సార్వత్రిక ఎన్నికల గురించి పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగింది. ఎక్కడ చూసినా ఎన్నికల ముచ్చటే. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది.. ఏ స్థానంలో ఎవరు గెలుస్తారు? అనే దానిపై జనాలు ముచ్చట్లు పెట్టుకునే వారు. అయితే ఏపీలో ఎన్నికలు ముగిసి ఏడాది కూడా కాలేదు. అప్పుడే మళ్లీ వచ్చే ఎన్నికల గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. 2029 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు?.. ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల.. జనసేనాని పవన్ కళ్యాణ్.. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌లలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే దానిపై చర్చ తెరపైకి వచ్చింది.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగు దేశం కూటమి గెలుపొంది.. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన వయస్సు 74 సంవత్సరాలు. అందుకే వచ్చేసారి ఎన్నికల్లో టీడీపీ వారసుడు నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారనే మాట వినిపిస్తోంది. గతంలో రెండు సంవత్సరాలు లోకేష్ ఐటీ శాఖ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. కానీ తర్వాత ఆయన రాజకీయంగా పరిణితి చెంది ఎక్కడైతే ఓడారో.. అక్కడే గెలిచి చూపించారు. మరోసారి ఐటీ శాఖ మంత్రి అయ్యారు. అయితే చంద్రబాబు తర్వాత టీడీపీ నుంచి ముఖ్యమంత్రి అయ్యేది నారా లోకేష్ అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ కచ్చితంగా గెలుపొందుతుందని.. నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని చెబుతున్నారు.
ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు జనసేనాని పవన్ కళ్యాణ్. తన పార్టీ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యేలను.. ఎంపీలను గెలిపించుకోవడమే కాకుండా కూటమి అభ్యర్థులను కూడా గెలిపించుకునేందుకు తీవ్రంగా చమటోడ్చారు. వందకు వంద శాతం తమ అభ్యర్థులను గెలిపించుకొని తీరారు. అలాగే కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా.. చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో నాలుగు శాఖలకు మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే 2029లో మాత్రం కచ్చితంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారాని.. అందులో నో డౌట్ అని అంటున్నారు.
అటు అయిదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగిన జగన్మోహన్ రెడ్డి.. ఈసారి తమ పార్టీ ఓడిపోవడంతో ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోయారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. కేవలం 11 స్థానాల్లో గెలుపొందింది. దీంతో అధికారాన్ని కోల్పోయింది. అయితే ఈసారి మాత్రం ఓడిపోయినప్పటికీ.. 2029 ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా గెలుపొందుతామని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని అంటున్నారు. అటు కాంగ్రెస్ కూడా ఏపీలో వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. 2029 నాటికి ఏపీలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈక్రమంలో 2029లో ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వైఎస్ షర్మిలనే ముఖ్యమంత్రి అవుతారని అంటున్నారు. ఇటీవల రెండు, మూడు సందర్భాల్లో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే చెప్పారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చామని.. 2029 నాటికి ఏపీలో కూడా అధికారం తమదేనని అన్నారు. అప్పటు వైఎస్ షర్మిలనే ముఖ్యమంత్రి అవుతారని వెల్లడించారు. ఇలా ఎవరికి వారు ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. మరి 2029లో గాలి ఎటు వైపు వీస్తుందో.. ఎవరు అధికారంలోకి వస్తారో చూడాలి మరి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY