అరకు ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి, 22 మందికి గాయాలు

Road Accident in Araku Ghat Road 4 Died 22 People Injured,Mango News,Mango News Telugu,Four including an infant die as mini-bus plunges into Andhra Pradesh's Araku valley,Four from Telangana die 19 hurt as mini bus trips on Araku hairpin bend,Vizag: 4 Dead Several Telangana Passengers Injured As Bus Falls Into Araku Valley

విశాఖపట్నం జిల్లా అరకులోయలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి అరకు వ్యాలీ పర్యటనకు వెళ్లి, విశాఖపట్నంకు తిరుగు ప్రయాణంలో ఉన్న పర్యాటకులతో వెళుతున్న బస్సు ప్రమాదవశాత్తు బోల్తాపడి లోయలోకి దూసుకెళ్లింది. అనంతగిరి వద్ద సుమారు 80 అడుగుల లోతు లోయలో బస్సు పడింది. ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 22 మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఎస్.కోట హాస్పిటల్ లో తరలించి ప్రాధమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్సకై విశాఖపట్నంలోని కింగ్ జార్జి హాస్పిటల్ కు తరలించారు. ఈ ప్రమాదంలో మృతులు, గాయపడిన వారు హైదరాబాద్ లోని షేక్ పేటకు చెందిన నాలుగు కుటుంబాల బంధుమిత్రులుగా గుర్తించారు.

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్‌, రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. “ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం అత్యంత దుఃఖదాయకం. మరణించిన వారి కుటుంబాలకు నా తీవ్ర సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడిన వారు అతి త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అరకు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే అరకు లోయ మార్గంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసులు మృతి చెందడం తీవ్ర దిగ్బ్రాంతి కలిగించిందని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్ అన్నారు. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకొవాలని, వారికి మంచి వైద్యం అందించాలని సూచించారు.

మరోవైపు ఈ రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్, డీఐజీ కాళిదాస్, ఎస్పి కృష్ణ లతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడి, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. బాధితులను అన్ని విధాల ఆదుకునేందుకు వ్యక్తిగతంగా ఎప్పటికప్పుడు అక్కడి అధికారులతో సీఎస్ మానిటరింగ్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రయాణీకులు హైదరాబాద్ లోని షేక్ పేట్ కు చెందిన వారు ఉన్నందున వారి ఇండ్లకు అధికారులను పంపాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ను శుక్రవారం రాత్రి సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =