ఏపీ వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్‌ సమీక్ష.. కేన్సర్‌ వ్యాధి నివారణ, చికిత్సపై ప్రత్యేక దృష్టి

AP CM YS Jagan Directs Officials To Strengthen Cancer Departments in The Review of Medical Sector, Ys Jagan Reviews On Medical Sector, CM YS Jagan Holds Health Review Meet, AP CM YS Jagan Stresses On Cancer Care, Aarogyasri Cancer Hospitals In Andhra Pradesh, Mango News, Mango News Telugu, AP Cancer News, AP Cancer Department, AP Medical Sector, AP CM Cancer Department Review, Jagan Reviews Medical Sector, AP CM YS Jagan Latest News And Updates, AP CM YS Jagan Mohan Reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్రంలో కేన్సర్‌ విభాగాలను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఏపీ వైద్య, ఆరోగ్య శాఖల పనితీరుపై సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో క్యాన్సర్‌ వ్యాధి నివారణ, చికిత్సపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి మెడికల్ కాలేజీలో దీనికోసం ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలని, మిగిలిన చోట్ల కూడా దశలవారీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న క్యాన్సర్ విభాగాలను మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు. విజయవాడ, అనంతపురం, కాకినాడ, గుంటూరు బోధనాసుపత్రుల్లో 4 లైనాక్ మిషన్లు (కాన్సర్ వ్యాధి చికిత్సలో రేడియేషన్ ఇచ్చే యంత్రాలు) ఏర్పాటు చేయాలని సీఎం జగన్ సూచించారు.

అలాగే శ్రీకాకుళం, నెల్లూరు, ఒంగోలులో లైనార్ బంకర్లు (హైఎనర్జీ, ఎక్సరే, తదితర పరికరాలు ఉండే గదులు) నిర్మాణానికి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 7 మెడికల్ కాలేజీల్లో కేన్సర్ విభాగాలను ఆధునీకరించి బలోపేతం చేయాలని, కొత్తగా నిర్మించిన మెడికల్ కాలేజీల్లో కూడా అత్యాధునిక క్యాన్సర్ విభాగాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇక ‘ఫ్యామిలీ డాక్టర్’ కార్యక్రమంపై సమీక్షించిన ముఖ్యమంత్రి, ఏడాదిలోగా రక్తహీనత సమస్యను రూపుమాపేందుకు చెర్యలు తీసుకోవాలని, ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు జిల్లాల్లో ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎం జగన్ అధికారులను కోరారు. ఇక ఈ సమీక్షలో.. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజినీ, వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు, మెడికల్ అండ్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ (కోవిడ్ మేనేజ్‌మెంట్ అండ్ వ్యాక్సినేషన్) ముద్దాడ రవిచంద్ర, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ జె.నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =