ఉక్రెయిన్ అధ్యక్షుడు హాట్ కామెంట్లు

Prime Minister Narendra Modi Visited Russia,Prime Minister Narendra Modi,PM Visited Russia, Modi in Russia tour, Putin,Russia talks up business with India,Putin receives Modi in Moscow,PM Modi in Russia,,Live Updates, Political Updates, Political News,Mango News, Mango News Telugu
Modi, Putin, Modi in Russia tour,Hot comments from the President of Ukraine

ఇండియా, రష్యా దేశాల మైత్రీ బంధాన్ని మరింత బలంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా.. ప్రధాని నరేంద్ర మోదీ  రష్యాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. 22వ ఇండో-రష్యా శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి ప్రధాని మోదీ జులై 8న  రష్యా చేరుకున్నారు. మంగళవారం ఉదయం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్, భారత ప్రధాని మోదీ అల్పాహారం తీసుకున్న తర్వాత ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరువురు ధ్వైపాక్షిక సంబంధాలపై విస్తృతస్థాయి చర్చలు జరిపారు.

అయితే తాజాగా భారత ప్రధాని మోదీ రష్యా టూర్‌పై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీ రియాక్ట్ అయ్యారు. మోదీ పర్యటన, పుతిన్‌ను ఆలింగనం చేసుకున్న ఫోటోలను చూసి తాను తీవ్ర నిరాశకు గురయ్యానని అన్నారు. ఇది శాంతి ప్రయత్నాలకు పెద్ద దెబ్బగా తాను భావించానని చెప్పుకొచ్చారు.

అంతేకాదు రష్యా క్షిపణుల దాడికి గురైన పిల్లలు.. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న  ఫోటోలను షేర్ చేస్తూ.. ‘ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య నేత అయిన మోదీ.. మాస్కోలో ప్రపంచంలోని అత్యంత రక్తపాత నేరస్థుడిని కౌగిలించుకోవడం తనను చాలా నిరాశకు గురి చేసిందని అన్నారు. ఇది శాంతి ప్రయత్నాలకు ఓ వినాశకరమైన దెబ్బ అంటూ జెలన్స్కీ అభిప్రాయపడ్డారు.

నిజానికి లోక్‌సభ ఎన్నికల తర్వాత తమ దేశంలో పర్యటించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని..ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ ఆహ్వానించారు. అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా భారత ప్రధాని మోదీని ఆహ్వానించారు. ఈ ఏడాది మార్చిలో రష్యా అధ్యక్షుడిగా పుతిన్ మరోసారి ఎన్నికైన తర్వాత.. ప్రధాని మోదీ ఈ ఇద్దరి నేతలతో మాట్లాడారు. తాజాగా మోదీ ఉక్రెయిన్ కాకుండా  రష్యా వెళ్లడం నచ్చని  జెలెన్స్కీ  ఇలా తన ఆవేదనను వెళ్లగక్కినట్లు చెప్పారు.

ఇటు ప్రధాని మోదీ, పుతిన్ మధ్య.. ఉక్రెయిన్‌ను రష్యా దురాక్రమించిన అంశంతో పాటు, రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా ఇండియన్స్ రిక్రూట్‌ చేసుకుని ఉక్రెయిన్‌ యుద్ధక్షేత్రాలకు తరలించిన ఉదంతాలన్నీ కూడా చర్చకు వచ్చాయి.  తమ ఆర్మీలో పనిచేస్తున్న ఇండియన్స్‌ను త్వరలోనే స్వదేశానికి పంపించేలా పుతిన్ అంగీకరిస్తున్నట్లు జాతీయ, అంతర్జాతీయ మీడియాలో వార్తలు వినిపించాయి.  దీంతో రష్యా సైన్యంలోని ఇండియన్స్‌కు విముక్తి లభించినట్లైంది.

మరోవైపు 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌‌లో యుద్ధం మొదలయ్యాక.. ప్రధాని మోదీ రష్యాకు వెళ్లడం ఇదే తొలిసారి. చివరిసారి 2022 సెప్టెంబర్‌లో ఉజ్బెకిస్థాన్‌లో ఎస్‌సీఓ అంటే షాంఘై సహకార సంస్థ  శిఖరాగ్ర సదస్సు సందర్భంగా అధ్యక్షుడు పుతిన్‌ను కలిశారు. ఆ సమయంలో  మోదీ ఇది యుద్ధ యుగం కాదని పుతిన్‌కు చెప్పారు.  చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే వివాదానికి పరిష్కారం కనుగొనగలమని నొక్కి చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE