పార్లమెంట్ శీతాకాల సమావేశాలు: లోక్ సభ, రాజ్యసభ నిరవధికంగా వాయిదా

2021 Winter Parliament Session, Both Houses Adjourned Sine Die a Day Before Schedule, Both Houses of Parliament adjourned sine die, Mango News, parliament highlights, Parliament Session Adjourned, Parliament Session Adjourned Sine Die, Parliament Winter Session, Parliament Winter Session Ends, Parliament Winter Session Ends Both Houses Adjourned Sine Die a Day Before Schedule, rajya sabha, Rajya Sabha adjourned sine die, Rajya Sabha Chairman, Vande Matram, Venkaiah Naidu, Winter Parliament Session, Winter Parliament Session 2021, Winter Parliament Session Adjourned Sine Die, Winter Parliament Session Adjourned Sine Die Amid Constant Uproar From Opposition

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటితో ముగిశాయి. ముందుగా నవంబర్ 29న ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు డిసెంబర్ 23 వరకు జరగాల్సి ఉండగా, ఒకరోజు ముందుగానే ఉభయసభలను నిరవధికంగా వాయిదా వేశారు. బుధవారం నాడు లోక్ సభలో లఖింపూర్ ఖేరీ ఘటనపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం పెట్టగా, రాజ్యసభలో 12 మంది ఎంపీలు సస్పెన్షన్ పై ప్రతిపక్షాలు చర్చకు పట్టుపట్టాయి. కొంత సమయం అనంతరం సభలను నిరవధికంగా వాయిదా వేస్తునట్టుగా లోక్ సభ చైర్మన్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు.

మొత్తం 18 రోజుల పాటుగా జరిగిన సమావేశాల్లో 3 నూతన వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు మరియు ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు-2021 వంటివి ఉభయసభల్లో ఆమోదం పొందాయి. ఇక మహిళల కనీస వివాహ వయస్సును ప్రస్తుతమున్న 18 నుండి 21కి సంవత్సరాలకు పెంచేందుకు రూపొందించిన బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టగా, ప్రభుత్వ, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఈ బిల్లును పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు కోసం పంపుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − two =