లేక్ ఫ్రంట్ పార్క్ చూసొద్దాం రండి

The Lakefront Park Has Been Buzzing With Visitors Since Sunday,The Lakefront Park Has Been Buzzing,Buzzing With Visitors Since Sunday,The Lakefront Park With Visitors,Mango News,Mango News Telugu,The Lakefront Park, Lakefront Park Visitors, Lakefront Park Open Daily From 5 Am To 11 Pm, Stalls And Food Courts,Walkers Card By Paying Rs 100,Walkers Card,The Lakefront Park Latest News,The Lakefront Park Latest Updates,The Lakefront Park Live News

ఇప్పటికే టూరిస్ట్ హబ్‌గా జెండా పాతేసిన హైదరాబాద్.. ఎప్పటికప్పుడు సందర్శకులను తనవైపు తిప్పుకోవడానికి వారికి కొత్త కొత్త అట్రాక్టివ్ ప్రాంతాలను పరిచయం చేస్తూనే ఉంటుంది. ఇప్పటికే హుస్సేన్ సాగర్ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్న కేసీఆర్ ప్రభుత్వం లేక్ ఫ్రంట్ పార్క్ ద్వారా..మరో ఆకర్షణీయమైన ప్రాంతాన్ని నగరవాసులకు పరిచయం చేసి మరింత ఉల్లాసాన్ని కలిగించే ఏర్పాటు చేసింది.

సెప్టెంబర్ 26న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్‌లోని లేక్ ఫ్రంట్ పార్క్‌ని లాంఛనంగా ప్రారంభించారు. అయితే గణేష్ నిమజ్జనం వల్ల కొద్ది రోజులపాటు ‌పార్కును మూసి ఉంచారు. కానీ వీకెండ్ కావడంతో నిన్నటి నుంచి అంటే అక్టోబర్ 1 నుంచి సందర్శకులకు లేక్ ఫ్రంట్ పార్క్ అందుబాటులోకి వచ్చేసింది.దీంతో తొలిరోజు ఈ పార్కును చూడటానికి వచ్చిన సందర్శకులతో ఆ ప్రాంతం కిటకిటలాడింది.

లేక్ ఫ్రంట్ పార్క్‌‌ను ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తెరిచే ఉంచుతారు. దీనిలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్, ఫుడ్ కోర్ట్‌లు ఉదయం 9 నుంచే ప్రారంభం అవుతాయి. ఈ పార్కు ఎంట్రీ ఫీజు పెద్దలకు రూ.50 ఉండగా పిల్లలకు రూ.10 గా నిర్ణయించారు.అలాగే వాకర్స్‌కి ప్రత్యేక సమయాన్ని నిర్ణయించారు. వీరు ఉదయం 5 గంటల నుంచే ఇక్కడకు వచ్చి వాకింగ్ చేసుకోవచ్చు. 5గంటల నుంచి 9 గంటల వరకు వాకర్స్ టైమ్‌గా నిర్ణయించారు. వీరికోసం ఇంకో సదుపాయాన్ని కల్పించింది తెలంగాణ సర్కార్. ఈ పార్క్‌లో వాకింగ్ కోసం రావాలంటే నెలకి రూ.100 చెల్లించి వాకర్స్ కార్డ్ తీసుకుని ఎంచక్కా వాకింగ్ చేసుకోవచ్చు.

అంతేకాదు లేక్ ఫ్రంట్ పార్క్‌లో బర్త్ డే పార్టీలు, కిట్టీపార్టీలు, గెట్ టుగెదర్ పార్టీలు కూడా చేసుకోవడానికి కూడా తాము అవకాశం కల్పిస్తున్నామని అధికారులు చెబుతున్నారు . 100 మంది లోపు సందర్శకులు ఈ పార్కులో పార్టీ చేసుకోడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. రూ.11వేలు చెల్లిస్తే పార్టీలకు అనుమతిని ఇస్తారు. అయితే ఫంక్షన్ హాల్స్‌తో పోల్చి చూస్తే..రూ.11వేలు అనేది చాలా చిన్నమొత్తం కాబట్టి.. చిన్న చిన్న పార్టీలకు లేక్ ఫ్రంట్ పార్క్ కేరాఫ్ అడ్రస్‌గా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.దీనికి తోడు ఆహ్లాదకరమైన కొత్త వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారని ..దీంతో కొద్ది రోజుల్లోనే ఇది సెంటర్ ఆఫ్ ఆల్ పార్టీస్ అవుతుందని భావిస్తున్నారు.అంతేకాదు లేక్ ఫ్రంట్ పార్క్‌కి ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి క్రేజ్ వచ్చింది. ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారడంతో టూరిస్ట్ స్పాట్‌గా మారిపోవడం గ్యారంటీ అని హైదరాబాదీలు చెప్పుకుంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − seven =