విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు కూడా తమ భర్తల నుంచి భరణం క్లెయిమ్ చేసుకునేందుకు అర్హులని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 125 ప్రకారం ముస్లిం మహిళ తన భర్త నుంచి భరణం క్లెయిమ్ చేసుకోవచ్చని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. న్యాయమూర్తులు బివి నాగరత్న , అగస్టిన్ జార్జ్ మసిహ్‌లతో కూడిన బెంచ్ తీర్పును వెలువరిస్తూ, భార్యకు భరణం పొందే చట్టబద్ధమైన హక్కుతో వ్యవహరించే పాత CrPCలోని సెక్షన్ 125 ముస్లిం మహిళలకు వర్తిస్తుంది. సెక్షన్ 125 ప్రకారం పెళ్లయిన మహిళలకు మాత్రమే కాకుండా మహిళలందరికీ వర్తిస్తుందనే ప్రధాన ముగింపుతో మేము క్రిమినల్ అప్పీల్‌ను తోసిపుచ్చుతున్నాము అని తీర్పును ప్రకటిస్తూ జస్టిస్ నాగరత్న అన్నారు.
మెయింటనెన్స్ కి వ్యయాలను అడిగే చట్టం మహిళలందరికీ వారి మతంతో సంబంధం లేకుండా వర్తిస్తుందని బెంచ్ స్పష్టం చేసింది. జీవన వ్యయాలు దానధర్మం కాదని, అది మహిళల హక్కు అని ధర్మాసనం స్పష్టం చేసింది. గృహిణి అయిన భార్య మానసికంగా, ఇతర మార్గాల్లో తమపై ఆధారపడుతుందన్న విషయం కొంతమంది భర్తలకు తెలియదని, భారతీయ పురుషులు గృహిణుల పాత్రను, త్యాగాన్ని గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు జస్టిస్ బివి నాగరత్న .
తన భార్యకు రూ.20 వేలు భరణం చెల్లించాలని తెలంగాణ కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మహ్మద్ అబ్దుల్ సమద్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అబ్దుల్ సమద్ తనకు ట్రిపుల్ తలాక్ చెప్పాడని పేర్కొంటూ, సీఆర్పీసీ సెక్షన్ 125 కింద ఆ మహిళ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. మహిళకు అనుకూలంగా తీర్పు వచ్చింది. డిసెంబర్ 13, 2023న సమద్ అప్పీల్‌ను హైకోర్టు తిరస్కరించింది. కానీ మధ్యంతర జీవన వ్యయంగా రూ.10,000 చెల్లించాలన్న కోర్టు.. ఈ కేసు నుంచి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని, వాటిని పరిష్కరించాల్సి ఉందని పేర్కొంది. CrPC లోని సెక్షన్ 125 కాకుండా ముస్లిం మహిళల (విడాకుల హక్కుల రక్షణ) చట్టం, 1986లోని నిబంధనలు ఇక్కడ వర్తిస్తాయి. దీనిని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని సమద్ సుప్రీంకోర్టులో వాదించారు. 1986లో షా బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పును కొట్టివేయడానికి అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం రూపొందించిన ఈ ప్రత్యేక చట్టంలోని సెక్షన్ 3 మరియు 4, మహర్ మరియు ఇతర అనుబంధ భత్యాలను ఆదేశించేందుకు మేజిస్ట్రేట్లను అనుమతించాయి. దీంతో ఫ్యామిలీ కోర్టులో సెక్షన్ 125 సీఆర్పీసీ వర్తించదని చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE