జగన్‌కి కేసీఆర్ సాయం చేసేనా?

Will KCR Help YS Jaganmohan Reddy?, KCR Help YS Jagan, YS Jagan, KCR, BRS, YCP, AP, Telangana, Andhra Pradesh, TS Politics, TS Live Updates, AP Live Updates, AP Politics, Political News, Mango News, Mango News Telugu
ys jagan, kcr, brs, ycp, ap, telangana

ఇద్దరు మాజీ సీఎం లు జగన్ – కేసీఆర్ లకు మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికి తెలిసిందే. ఇరు రాష్ట్రాల్లో ఏ ఎన్నికలు వచ్చిన ఇరువురు సపోర్ట్ చేసుకుంటు వస్తున్నారు. అలాగే కేసీఆర్ తో జగన్ నిత్యం టచ్ లో ఉంటారు. ఒకరి బాగోగులు..ఒకరు మాట్లాడుకుంటూ రాజకీయాల విషయాల గురించి చర్చించుకుంటారు. అంతే ఎందుకు ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని ప్రపంచం మొత్తం కోడైకూసినా..కేసీఆర్ , కేటీఆర్ లు మాత్రం జగన్ భారీ మెజార్టీతో గెలవబోతున్నాడని చెప్పి ..జగన్ తో తమకున్న నమ్మకాన్ని చెప్పకనే చెప్పారు. అలాంటి ఇరు నేతలు ఇప్పుడు ఇంటికే పరిమితం అయ్యారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అనూహ్యంగా ఓటమిని కూడగట్టుకుంది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో అయితే ఆ పార్టీ ఖాతా కూడా తెరలేదు. అదే సమయంలో వైసీపీ పార్టీ 151 స్థానాల నుంచి కేవలం 11 సీట్లకే పరిమితమయి అంతులేని ఓటమిని చవిచూసింది. ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పిరాయింపులతో సంక్షోభంలో పడిపోయింది, అటు ఆంధ్రలో వైసీపీ లో నాయకులు పార్టీని వీడి ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా అన్నింటిలోనూ వైసీపీ పార్టీ యాధృచ్చికంగానే బీఆర్ఎస్ పార్టీ ఫాలో అవుతుంది. అయితే ఇప్పుడు ఏకంగా బహిరంగంగానే బీఆర్ఎస్ పార్టీ మద్దతు తీసుకోవడానికి వైసీపీ సిద్దమయింది.

కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని.. దీనిపై ఢిల్లీ వేదికగా ధర్నా  చేయనున్నట్లు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. జులై 24వ తేదీన ఢిల్లీలో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ధర్నా చేస్తానని.. అనంతరం ప్రధాని మోడీ ని కలిసి ఏపీలో నెలకొన్న భయానక పరిస్థితులను ఆయనకు వివరిస్తామని జగన్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు జగన్ ధర్నాకు వైసీపీ ఎంపీలు తప్ప మిగతా ఏ పార్టీ ఎంపీలు సపోర్ట్ చేయని పరిస్థితి నెలకొంది. అయితే జగన్‌ తన కేసుల కారణంగా మోడీని కాదని మరో వైపు దిక్కులు చూసే పరిస్థితి లేదు. కనుక మోడీ పట్టించుకోకపోయినా ఆయనకు ఆగ్రహం కలిగించే పనులేవీ చేయలేరు. ఎన్డీయే కూటమి ఫై పోరాటం చేస్తా అంటున్న జగన్ కు బీజేపీ సపోర్ట్ చేసే పరిస్థితి లేదు..ఇక కాంగ్రెస్ ఎంపీలు ఎలాగు చేయరు. మిగతా పార్టీలు ఎన్డీయేను కాదని సపోర్ట్ చేయడం..అది కూడా జగన్ కు చేయడం దాదాపు అసాధ్యమే. సో ఇక జగన్ మిగిలింది బిఆర్ఎస్ ఎంపీలు మాత్రమే. మరి వారు సపోర్ట్ చేస్తారా..? స్వయంగా జగన్ కు సపోర్ట్ చేయాలని వారికి లేకపోయినా..ఒకవేళ కేసీఆర్ ఏమైనా చెపితే వారు చేయాల్సి వస్తుంది.

జగన్‌, కేసీఆర్‌ ఇద్దరూ ప్రాణ స్నేహితులే… ఇద్దరూ కష్టాల్లో ఉన్నారు. కనుక ఒకరికొకరు సాయం చేసుకోవచ్చు. కనుక ఢిల్లీలో ధర్నాకి బిఆర్ఎస్‌ నేతలని పంపమని అడిగే నైతిక హక్కు జగన్‌కు ఉంది. బహుశః కేసీఆర్‌కి కూడా కష్టంలో ఉన్న తన మిత్రుడికి మళ్ళీ సాయపడాలనే ఆలోచన ఉండవచ్చు. కానీ కూతురు కల్వకుంట్ల కవిత ఇంకా జైల్లోనే ఉంది. అదీగాక ఎన్డీయేలో టీడీపీ, టీడీపీ ప్రభుత్వంలో బీజేపీ ఉన్నాయి. కనుక కేసీఆర్‌ కూడా మోడీకి ఆగ్రహం కలిగించే పనులేవీ చేయలేరు. మరి ఈ ఇద్దరు మిత్రలకు ఒకరికి ఒకరు సాయం అందించాలని ఉన్న పరిస్థితిలే వారికి అడ్డుపడుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE