పారిస్ ఒలింపిక్స్‌లో మను భాకర్ భారతదేశానికి తొలి పతకాన్ని అందించారు. మహిళల 10మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను కాంస్య పతకాన్ని గెలుపొందారు. ఒలింపిక్స్ పతకం గెలిచిన భారత తొలి మహిళా షూటర్‌గా ఆమె చరిత్ర సృష్టించారు. 10మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో భారత్ గెలిచిన తొలి పతకం కూడా ఇదే. మను సాధించిన ఈ పతకంతో భారత్ ఖాతాలో ఇప్పటివరకు అన్ని ఒలింపిక్స్‌లలో కలిపి షూటింగ్ ఈవెంట్‌లో అయిదు పతకాలు చేరాయి. జులై 28న ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో మను భాకర్ మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని అందుకున్నారు. దక్షిణ కొరియా ప్లేయర్లు జిన్ యే ఓమ్, యేజి కిమ్ వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచి స్వర్ణం, రజత పతకాలను సాధించారు.
షూటింగ్ ఈవెంట్ ఫైనల్ చాలా ఉత్కంఠ రేకెత్తిస్తుంది. విజేతను నిర్ణయించడానికి మొత్తం 24 షాట్లు అవసరం అవుతాయి.ఫైనల్లో ముందుగా 8 మంది షూటర్లు 10 షాట్‌లు సంధిస్తారు. ఆ తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. 11, 12 షాట్‌లు ఆడిన తర్వాత అందరి కంటే తక్కువ స్కోరు ఉన్న షూటర్ పోటీ నుంచి వైదొలుగుతారు. ఇలా ప్రతీ రెండు షాట్‌ల తర్వాత ఒక్కో షూటర్ అవుట్ అవుతారు.
చివరకు 24 షాట్‌లు ముగిశాక టాప్-3లో నిలిచిన వారికి స్వర్ణ, రజత, కాంస్య పతకాలు లభిస్తాయి.ఫైనల్లో మను భాకర్ ఆట ఎలా సాగిందంటే, మొదటి 10 షాట్లు ఆడిన తర్వాత 100.3 పాయింట్లతో ఆమె మూడో స్థానంలో నిలిచారు.12వ షాట్ తర్వాత 121.2 పాయింట్లు, 14వ షాట్ తర్వాత 140.8 పాయింట్లు, 16వ షాట్ తర్వాత 160.9 పాయింట్లు, 18వ షాట్ తర్వాత 181.2 పాయింట్లు, 20వ షాట్ తర్వాత 201.3 పాయింట్లు, 22వ షాట్ తర్వాత 221.7 పాయింట్లు సాధించారు. ఈ దశలో 221.8 పాయింట్లు సాధించిన కిమ్ తదుపరి రెండు రౌండ్లకు అర్హత సాధించారు. మను ఎలిమినేట్ అయ్యారు. దీంతో మూడో స్థానానికి పరిమితమయ్యారు.విజేతగా నిలిచిన జిన్ యే 243.2 పాయింట్లు, రన్నరప్ కిమ్ యేజి 241.3 పాయింట్లు సాధించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY