ప్రజా దర్బార్.. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఈ పేరు ఎక్కువగా వినపడేది. ప్రతిరోజూ ఉదయే ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించే వారు. ఆ తర్వాత వచ్చిన పాలకులు క్రమక్రమంగా ప్రజాదర్బార్‌ను పట్టించుకోవడం మానేశారు. గతేడాది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరిగి ప్రజార్భార్ను ప్రారంభించారు. అటు ఏపీలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి ప్రజాదర్భార్ ప్రారంభమయింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లు ప్రజా దర్భార్ను కొనసాగిస్తున్నారు. అయితే ప్రజాదర్భార్‌కు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఇక నుంచి ప్రజాదర్భార్‌ను సక్రమంగా నిర్వహించాలని.. ఒకరిద్దరు మంత్రులే కాకుండా అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆదేశించారు. దీని ద్వారా ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కరించేందుకు వీలు ఉంటుందని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అంతేకాకుండా ప్రజాదర్బార్ ద్వారా వీలైనంత త్వరగా ప్రజల్లోకి వెళ్లొచ్చని ఆలోచిస్తున్నారు. అందుకే ప్రజాదర్భార్ కోసం ఆగష్టు నెలకు సంబంధించి చంద్రబాబు నాయుడు డ్యూటీలు కూడా వేశారు. మొక్కు బడిగా కాకుండా.. ఉదయం 7 గంటల వరకు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి ప్రజల నుంచి వినతులు స్వీకరించాలని చంద్రబాబు నాయుడు మంత్రులను ఆదేశించారు. ప్రజాదర్భార్‌కు వచ్చిన ప్రతి ఒక్కరి నుంచి వినతులు స్వీకరించాలని.. వారి సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలని కోరారు.
ఈ మేరకు ఆగష్టు నెలలో మొదటి 15 రోజులకు చంద్రబాబు నాయుడు మంత్రులకు డ్యూటీలు వేశారు. ఆగష్టు 1వ తేదీని పర్చూరి అశోక్ బాబు, మాజీ మంత్రి దేవినేని ఉమా… రెండో తేదీన మంత్రి గొట్టిపాటి రవికుమార్.. టీడీపీ ఏపీ చీఫ్ పల్లా శ్రీనివాస్ యాదవ్.. 3వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ ఏపీ చీఫ్ పల్లా శ్రీనివాస్ యాదవ్.. 5 తేదీన మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు.. బొల్లినేని రామారావు.. 6వ తేదీన మంత్రి వంగలపూడి అనిత, బీద రవిచంద్ర యాదవ్.. 8వ తేదీన మంత్రి పొంగూరు నారాయణ.. మాజీ మంత్రి జవహోర్.. 9వ తేదీని మంత్రి నిమ్మల రామానాయుడు.. టీడీపీ ఏపీ చీఫ్ పల్లా శ్రీనివాస్ యాదవ్.. 10వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు.. పల్లా శ్రీనివాస్ యాదవ్.. 12వ తేదీన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, వర్ల రామయ్య.. 13వ తేదీన మంత్రి టీజీ భరత్, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి.. 14వ తేదీన మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, కిషోర్ కుమార్ రెడ్డిలు ప్రజాదర్భార్‌లో పాల్గొననున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ