ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్లారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ అక్కడ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో రేవంత్ ఫెయిల్ అయ్యారనే మాట గట్టిగా వినిపించింది. ఈక్రమంలో ఆ అపవాదును పోగొట్టుకునేందుకు రేవంత్ రెడ్డి ఇటీవల రెండోసారి విదేశీ పర్యటనకు వెళ్లారు. ఈనెల తన బృందంతో కలిసి అమెరికాకు వెళ్లారు. దిగ్గజ కంపెనీల అధిపతులను కలిసి రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. గూగుల్, కాగ్నిజెంట్, అమెజాన్, ట్రైజిన్ టెక్నాలజీస్, జొయిటీస్ వంటి కంపెనీలతో పాటు ఉన్న తక్కువ సమయంలోనే యాభై కంపెనీల అధిపతులతో రేవంత్ రెడ్డి సమావేశామ్యారు.
తాజాగా అమెరికా పర్యటనకు ముగించుకున్న రేవంత్ రెడ్డి బృందం సౌత్ కొరియాకు పయనమయింది. ఈక్రమంలో రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సక్సెస్ అయిందా? ఫెయిల్యూర్? అయిందా అనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే దావోస్ పర్యటన ఫెయిల్ అయినప్పటికీ.. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన మాత్రం గ్రాండ్ సక్సెస్ అయిందనే మాట వినిపిస్తోంది. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో రేవంత్ రెడ్డి ఈసారి సక్సెస్ అయ్యారనే మాట వినిపిస్తోంది. దిగ్గజ కంపెనీలతో రేవంత్ రెడ్డి పలు ఒప్పందాలు చేసుకున్నారని.. వాటి ద్వారా రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
దిగ్గజ కంపెనీల అధినేతలకు ఫ్యూచర్ సిటీ మీద తన విజన్‌ను చెప్పుకునే విషయంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారనే భావన వ్యక్తమవుతోంది. అలాగే ఫ్యూచర్ సిటీలో భాగంగా స్కిల్ యూనివర్సిటీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సిటీ నిర్మాణానికి సంబంధించి తమ ప్రభుత్వ ఆలోచల్ని రేవంత్ రెడ్డి వివరించకగా.. పారిశ్రామిక వేత్తల నుంచి సానుకూల స్పందన వ్యక్తమయిందట. మొత్తానికి రేవంత్ రెడ్డి అమెరికా టూర్ ముగిసే సమయానికి మొత్తం 19 దిగ్గజ కంపెనీలు తెలంగాణలో రూ. 3, 532 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తద్వారా కొత్తగా 30, 750 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నట్లు తెలిపాయి. మొత్తానికి చూసుకుంటే రేవంత్ రెడ్డి బృందం అమెరికా టూర్ సక్సెస్ అయిందనే వాదన బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం సౌత్ కౌరియా పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి టీం.. అక్కడి నుంచి ఎన్ని పెట్టుబడులు తీసుకొస్తారనేది చూడాలి.