మెగా కోడలిగా బాధ్యతలు నిర్వహిస్తూనే, అపోలో హాస్పిటల్స్ విషయంలోనూ అంతే బాధ్యతలు నిర్వహించే ఉపాసన.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలలో యాక్టివ్ గానూ ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులపై స్పందిస్తూ తన మనసులోని భావాలను, బాధను వ్యక్తపరుస్తూ ఉంటుంది. తాజాగా అలా ఇండిపెండెన్స్ డే సమయాన మెగా కోడలు ఉపాసన కొణిదెల చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కోల్ కతాలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్యపై రామ్ చరణ్ భార్య ఉపాసన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మానవత్వాన్ని పూర్తిగా అపహస్యం చేసేలా ఈ సంఘటన ఉందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో అనాగరికతకు అద్దం పట్టేలా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులు కొనసాగుతుంటే.. భారతీయులమంతా ఎలా ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నామని తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
భారత దేశానికి మహిళలు వెన్నుముక లాంటి వారని ఉపాసన అన్నారు. ముఖ్యంగా మహిళలు హెల్త్ కేర్ రంగంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని రాణిస్తున్నారని ఆమె గుర్తు చేశారు. ఈ క్రమంలో జూనియర్ మహిళ డాక్టర్‌పై అఘాయిత్యం జరగడం దారుణమని బాధపడ్డారు. ఈ సంఘటనలు చూస్తే మనుషుల్లోని మానవత్వం ఎటు పోతుందోనని ఆందోళన కలుగుతుందని ఉపాసన కొణిదెల ఎమోషనల్ అయ్యారు.
ఇదిలా ఉండగా.. కోల్ కతాలో ట్రైయినీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన దేశంలో తీవ్రదుమారంగా మారింది. మరో నిర్భయ ఘటనగా అభివర్ణిస్తూ ఇప్పటికే ఎంతోమంది దీనిపై పోరాడటానికి రోడ్డెక్కారు. మరోవైపు ఇప్పటికే హైకోర్టు సీబీఐకి అప్పగించింది.ఈ ఘటనలో బీహార్ కు చెందిన నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే యువతి పోస్టుమార్టం రిపోర్టులో మాత్రం.. సాముహిక అత్యాచారం జరిగినట్లు బైటపడింది. అదే విధంగా ఆమె శరీరంలో 150 ఎంఎల్ ల వీర్యం ఉన్నట్లు రిపోర్టులో తేలింది. అంతేకాకుండా జూనియర్ డాక్టర్ నోటిలో నుంచి , కళ్ల వెంట రక్తం వచ్చాయని..శరీరంలోని అంతర్గత అవయవాలు కూడా పూర్తిగా డ్యామెజ్ అయినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో ఈ ఘటనకు బాధ్యులైనవారిని కఠినంగా శిక్షించాలంటూ దేశవ్యాప్తంగా నిరసలు మిన్నంటుతున్నాయి.