రేసులో కాంగ్రెస్ ఎక్క‌డ‌?

Where is the Congress in the race,Where is the Congress,Congress in the race,Mango News,Mango News Telugu,Congress, Congress Candidates, telangana, Telangana Assembly Elections, Telangana Congress, TPCC Chief Revanth Reddy,Congress Wins Race of Manifestos,Telangana Assembly Elections Latest News,Telangana Assembly Elections Latest Updates,Telangana Assembly Elections Live News
Congress

తెలంగాణ‌లో రాజ‌కీయాలు హీటెక్కాయి. ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌తో ఆయా పార్టీలు అల‌ర్ట్ అయ్యాయి. అధికార పార్టీ అభ్య‌ర్థుల‌ను ముందే ప్ర‌క‌టించేసి రిలాక్స్ గా.. ప్ర‌చారం చేసుకుంటుంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం త‌మ‌దే అంటూ ప్ర‌క‌ట‌న‌లు గుప్పించే కాంగ్రెస్ టికెట్ల కేటాయింపు రేసులో ఇంకా వెనుక‌బ‌డే ఉంది. అభ్యర్థుల ఎంపిక ఇప్ప‌టికీ కొలిక్కి రాలేదు. తెలంగాణ‌లో ఉన్న మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకుగాను దాదాపు 70 చోట్ల మాత్రం ఎంపిక పూర్త‌యిన‌ట్లు వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. మిగతా స్థానాల్లో స్క్రీనింగ్‌ కమిటీ సభ్యుల ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మరోసారి భేటీ కావాలని నిర్ణయించిన‌ట్లు తెలిసింది.అభ్యర్థులను ప్రకటించాక తిరుగుబాట్లు.. తలపోట్లు పెరిగే అవ‌కాశం ఉన్నందున ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తోంది.

ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గానికి ఇద్ద‌రు.. ఆ ఒక్క‌రు ఎప్ప‌టికి?

కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థ‌ల ప్ర‌క‌ట‌న‌కు ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తోంది. ఏకాభిప్రాయం కుదరని సీట్లకు ఇద్దరేసి పేర్లతో జాబితా రూపొందించి పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)కి పంపే ప్ర‌య‌త్నంలో ఉంది. సీఈసీ ఇచ్చే మార్గదర్శకాల మేరకు ఆ సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయాలని నిర్ణయించారు. ఈనెల 14వ తేదీ తర్వాత భేటీ అయ్యే సీఈసీ పరిశీలన చేశాక, అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. ఈనెల 15 నుంచి పార్టీ ముఖ్యనేతల బస్సుయాత్ర ప్రారంభం కానుండటంతో, యాత్రకు ముందే పేర్లు ప్రకటిస్తే తలెత్తే అసంతృప్తులు, అసమ్మతులతో యాత్రకు ఆటంకాలతో అభాసుపాలవుతుందనే తలంపుతో యాత్ర తర్వాత ప్రకటించే ఆలోచనలో కూడా ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

వీరికి ఖ‌రారు అయిన‌ట్లేనా?

పార్టీలో కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు మాత్రం టికెట్లు ఖ‌రారు అయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అవి ఏమిటంటే.. కొడంగల్ – రేవంత్‌రెడ్డి, హుజూర్‌నగర్ – ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ – పద్మావతి, మధిర – భట్టి విక్రమార్క, మంథని – శ్రీధర్‌బాబు, ములుగు – సీతక్క, నల్గొండ – కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలంపూర్‌– సంపత్‌కుమార్, నాగార్జునసాగర్ – కుందూరు జైవీర్‌రెడ్డి, కామారెడ్డి – షబ్బీర్‌అలీ, పాలేరు–తుమ్మల నాగేశ్వరరావు, కొత్తగూడెం – పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ధర్మపురి – ఎ. లక్ష్మణ్‌ కుమార్, జగిత్యాల –జీవన్‌రెడ్డి, భద్రాచలం – పొదెం వీరయ్య, ముధోల్ – ఆనందరావు పటేల్, బెల్లంపల్లి – గడ్డం వినోద్‌ కుమార్, వికారాబాద్ – గడ్డం ప్రసాద్‌కుమార్, పరిగి – రామ్మోహన్‌రెడ్డి, మహేశ్వరం – చిగురింత పారిజాత, ఆలేరు – బి. ఐలయ్య, దేవరకొండ – బాలునాయక్, వేములవాడ – ఆది శ్రీనివాస్, నాంపల్లి–ఫిరోజ్‌ఖాన్, కోరుట్ల–జె.నర్సింగ్‌రావు, అచ్చంపేట–వంశీకృష్ణ, జహీరాబాద్‌– ఎ.చంద్రశేఖర్, నారాయణపేట– ఎర్ర శేఖర్,రామగుండం–రాజ్‌ఠాకూర్,వరంగల్‌ వెస్ట్‌– నాయిని రాజేందర్‌ రెడ్డి, గజ్వేల్‌– తూంకుంట నర్సారెడ్డి,నిర్మల్‌– శ్రీహరిరావు, భువనగిరి– కుంభం అనిల్‌ కుమార్రెడ్డి,పెద్దపల్లి– విజయరమణారావు,సర్పంపేట– దొంతి మాధవరెడ్డి, పాలకుర్తి– హనుమాండ్ల ఝాన్సీ, మహబూబ్నగర్‌– యెన్నం శ్రీనివాసరెడ్డి ,ఇబ్రహీంపట్నం– మల్‌ రెడ్డి రంగారెడ్డి, ఖానాపూర్‌ –ఎ.బొజ్జు, బాల్కొండ – ఆరెంజ్‌ సునీల్‌ రెడ్డి, రాజేంద్రనగర్‌ – జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్, హుస్నాబాద్‌ – పొన్నం ప్రభాకర్, తాండూర్‌ – వై.మనోహర్‌ రెడ్డి , దుబ్బాక– చెరుకు శ్రీనివాస్‌ రెడ్డి, మల్కాజిగిరి– మైనంపల్లి హన్మంతరావు, కంటోన్మెంట్‌ – వెన్నెల (గద్దర్‌ కుమార్తె), మంచిర్యాల– ప్రేమ్‌ సాగర్‌ రావు, కొల్లాపూర్‌– జూపల్లి కృష్ణారావు, ఆదిలాబాద్‌– కంది శ్రీనివాస్‌ రెడ్డి, వరంగల్‌ ఈస్ట్‌– కొండా సురేఖ, భూపాలపల్లి– గండ్ర సత్యనారాయణ, షాద్‌నగర్‌– వీర్లపల్లి శంకర్, నిజామాబాద్‌ అర్బన్‌– ధర్మపురి సంజయ్,ఎల్‌బీనగర్‌ – మధుయాష్కీ గౌడ్, కల్వకుర్తి– కసిరెడ్డి వారాయణరెడ్డి,అశ్వారావుపేట– తాటి వెంకటేశ్వర్లు,పటాన్‌చెరు–కాట శ్రీనివాస్‌గౌడ్, సూర్యాపేట– ఆర్‌. దామోదర్‌ రెడ్డి, నాగర్‌ కర్నూల్‌– కూచుకుళ్ల రాజేశ్‌ రెడ్డి, మేడ్చల్‌– తోటకూర జంగయ్య యాదవ్, ముషీరాబాద్‌– అంజన్‌ కుమార్‌ యాదవ్,శేరిలింగంపల్లి– రఘునాథ్‌ యాదవ్, తదితరులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 2 =