జగన్‌‌ కంచుకోట కదులుతుందా?

YCP Leaders Are Shaking With Pawan Kalyans Visit To Kadapa, YCP Leaders Are Shaking, Pawan Kalyans Visit To Kadapa, CM Chandrababu, Deputy CM Pawan Kalyan, Jagan, YCP, YCP Leaders, Andhra Pradesh, AP Live Updates, AP Politics, Telangana, TS Politics, TS Live Updates, Political News, Mango News, Mango News Telugu

ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అంటే జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కానీ ఇప్పుడు లెక్కలు మారాయి. డిప్యూటీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడంతో పొలిటికల్ చక్రంలో లెక్కలు తిరగరాసే స్థానంలో నిలబడ్డారు. తప్పు తనవాడిదయినా వదిలేది లేదంటూ వార్నింగ్ ఇస్తూ.. రాజకీయ రంగంలో కొత్త ఒరవడిని సృష్టిస్తూ దూసుకు వెళ్తున్నారు.

ఎక్కడ కూడా తగ్గేది లేదు అన్నట్లుగా…సీఎం చంద్రబాబు అండదండలతో కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకు వెళుతున్నారు పవన్ కళ్యాణ్. అధికారం కొత్త.. అలాగే ఈ పదవి కూడా పవన్‌కు కొత్తే . అయినా ఎక్కడ కూడా వెనకడుగు వేయడం లేదు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తనకు ఇచ్చిన శాఖలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ విమర్శల నోటి వెంట కూడా ప్రశంసలు అందుకునే స్థాయికి కొద్ది రోజుల్లోనే చేరుకున్నారు.

నిత్యం.. పంచాయతీ శాఖపై రివ్యూ నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్… గ్రౌండ్ స్థాయిలో అవినీతి పాలనరహిత రాష్ట్రంగా ఏపీని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే తాజాగా… పవన్ కళ్యాణ్ తీసుకున్న కీలక నిర్ణయం వైసీపీ నేతల్లో వణుకు పుట్టిస్తుందట. జగన్మోహన్ రెడ్డి ఇలాకా అయిన ఉమ్మడి కడప జిల్లాలో…త్వరలోనే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడుగుపెట్టబోతున్నారు.

కడపజిల్లా అంటే జగన్ పేరు అందరికీ వినిపిస్తుంది. అది వైసీపీకి కంచుకోటగా చెప్పుకుంటారు. అలాంటి కడప జిల్లాలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. ఏపీ వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు కూటమి ప్రభుత్వం నిర్వహించబోతుంది. దీనిలో భాగంగానే రెవెన్యూ సదస్సులలో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు.తాజాగా ఉమ్మడి కడపజిల్లా పర్యటన కూడా అందులో భాగంగా మారింది .

ఆగస్ట్ 21వ తేదీన రైల్వే కోడూరు మండలంలోని మైసూరు వారి పల్లెలో నిర్వహించే సదస్సుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరవుతారని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. దీనిపై అధికారులు కీలక ప్రకటన కూడా చేశారు. అయితే కడప జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటనలో… జగన్మోహన్ రెడ్డిపైన, వైసీపీ నేతలపైన ఎవరైనా ఫిర్యాదు చేస్తారా అన్న ప్రశ్నలు వైసీపీ వర్గీయులలో కనిపిస్తోంది.

ఒకవేళ జగన్ మోహన్ రెడ్డిపైన కానీ, వైసీపీ నేతలపైన కానీ ఫిర్యాదు అందితే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. కచ్చితంగా వెంటనే యాక్షన్ తీసుకొని అవకాశాలు కూడా ఉంటాయి. దీంతో పవన్ కళ్యాణ్ కడపజిల్లా పర్యటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అసలే అసెంబ్లీ వేదికగా.. తప్పు తాము చేసినా నిలదీయండి తప్పకుండా చర్యలంటాయని చెప్పిన పవన్ కళ్యాణ్..వైసీపీ నేతలు తప్పులపై ఫిర్యాదులు వస్తే ఊరుకుంటారా అన్న వాదన వినిపిస్తోంది.