శ్రీశైలంలోని భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్న సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు

CJI Justice NV Ramana visited the Srisailam, CJI Justice NV Ramana visited the Srisailam temple, CJI Justice NV Ramana Visits Srisailam Temple, CJI Justice NV Ramana Visits Srisailam Temple Today, CJI NV Ramana, CJI NV Ramana Couple Visits Srisailam Temple, CJI NV Ramana visits Srisailam Bhramaramba Mallikarjuna Swamy temple, CJI visits Srisailam Bhramaramba Mallikarjuna temple, Mango News, NV Ramana, NV Ramana Visits Srisailam Temple

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు శుక్రవారం ఉదయం శ్రీశైలంలోని భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్నారు. సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి శ్రీశైల మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు కుటుంబ సమేతంగా విచ్చేసిన జస్టిస్ ఎన్వీ రమణను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి రెడ్డి, దేవస్థాన కార్యనిర్వహణాధికారి కేఎస్‌.రామరావు, అర్చకస్వాములు ఆలయ మర్యాదలతో రాజగోపురం వద్ద స్వాగతం పలికారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం వేద పండితుల ఆశీర్వాదంతో సీజేఐ ఎన్వీ రమణ దంపతులను ఆలయంలోకి తీసుకువెళ్లి స్వామి, అమ్మవార్లను దర్శనం చేయించారు.

అనంతరం అమ్మవారి ఆలయం వద్దగల ఆశీర్వచన మండపంలో సీజేఐ ఎన్వీ రమణకు వేద పండితులు వేద మంత్రాలు పలుకగా, అర్చకులు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి, దేవస్థాన ఈవో కేఎస్‌.రామరావు స్వామివారి శేషవస్త్రాలను, ప్రసాదాలను, స్వామి అమ్మవార్ల జ్ఞాపికను అందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఇటీవల దేవస్థానం ప్రచురించిన స్కాంద పురాణంలోని శ్రీశైలం ఖండ మూలప్రతిని పరిష్కరించి సంస్కృతంలో మూల గ్రంథమును, తెలుగులో శ్లోక బావార్ధములను రూపొందించడంలో ముఖ్య పాత్రను పోషించిన శ్రీ త్రిష్టి లక్ష్మీ సీతారామాంజనేయ శర్మని సీజేఐ ఎన్వీ రమణ సత్కరించారు.

తరువాత శ్రీశైలంలోని పంచమఠాలలో ఒకటైన ఘంట మఠం జీర్ణోద్ధరణ సందర్భంగా లభించిన పురాతన తామన శాసనాలను ఆలయ ప్రాంగణంలో నిశితంగా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్కియాలజీ ఆఫ్ సర్వే ఇండియా మైసూరు విభాగపు డైరెక్టర్ డాక్టర్ మునిరత్నం రెడ్డి శాసనాలకు సంబంధించిన చారిత్రాత్మక విశేషాలను సీజేఐకి వివరించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వెంట డిఐజి వెంకటరామిరెడ్డి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణ కృపా సాగర్, జిల్లా ఎస్పీ డాక్టర్ కె. పక్కిరప్ప, ఏపీ హైకోర్టు రిజిస్టర్ న్యాయమూర్తి జస్టిస్ డి వెంకటరమణ, తెలంగాణ హైకోర్టు రిజిస్టర్ న్యాయమూర్తి జస్టిస్ వెంకటేశ్వర్ రెడ్డి, జస్టిస్ డి.నాగార్జున, జిల్లా జడ్జి ఫ్యామిలీ కోర్టు వి.శ్రీనివాస్, దేవస్థాన ఈవో కేఎస్‌.రామరావు, ఆత్మకూరు డిఎస్పీ శృతి తదితరులున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =