కేటీఆర్‌పై మ‌హిళా క‌మిష‌న్ ఆగ్ర‌హం..

Womens Commission Is Angry With KTR, Women Commission Notice To KTR, Women Commission Orders Probe Into KTR, KTR Receives Notices, KTR Expresses Regrets, Free Bus, KTR, Mahila Commission, RTC Bus, Latest RTC Bus News, Revanth Reddy, Telangana, TS Politics, TS Live Updates, Political News, Mango News, Mango News Telugu

తెలంగాణ‌లో రాజ‌కీయాలు మళ్లీ రంజుకుంటున్నాయి. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లు సాగుతున్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావుకి మధ్య చిన్నపాటి యుద్దమే నడుస్తోంది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి అధికార పక్ష నాయకులను కాకుండా మహిళలపై అనుచిత వాఖ్యలు చేసి నాలుక కర్చుకున్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అభివృద్ధి ప‌రంగా దూసుకెళ్తుంటే ప్ర‌తిప‌క్షమైన బీఆర్ఎస్ వాటిపై విమ‌ర్శ‌లు చేస్తోంది. ఎన్నిక‌లకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన మ‌హిళ‌ల‌కు ఫ్రీ బ‌స్సు ప‌థకంపై మొద‌టి నుంచి వివాదం న‌డుస్తూనే ఉంది. అయితే ఈ ప‌థ‌కంపై బీఆర్ఎస్ నేత‌లు ప‌లు ర‌కాలుగా విమ‌ర్శ‌లు కురిపిస్తే.. కాంగ్రెస్ ప్ర‌భుత్వం మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప‌థ‌కం అద్భుత‌మైన‌ద‌ని ప‌లు సంద‌ర్భాల్లో పేర్కొన్నారు. అయితే తాజాగా కేటీఆర్ ఉచిత బస్సు ప‌థ‌కంపై అలాగే అందులో ప్ర‌యాణించే మ‌హిళ‌ల‌పై చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్పందంగా మారాయి.

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు సౌకర్యంపై మాట్లాడుతూ.. బస్సుల్లో కుట్లు అల్లికలే కాదు, అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు చేసుకున్న మాకు అభ్యంతరం లేదు అంటూ కేటీఆర్ కామెంట్ చేశారు. అంతేకాకుండా మనిషికో బస్సు పెట్టండి. కుట్లు, అల్లికలు అవసరం అయితే డాన్స్‌లు, రికార్డింగ్ డాన్స్‌లు కూడా చేసుకుంటారు అంటూ మహిళలను అవమానించే విధంగా కేటీఆర్ మాట్లాడారు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు తీవ్రంగా ఖండిస్తున్నారు.

మహిళలపై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించింది తెలంగాణ మహిళా కమిషన్. కేటీఆర్ వ్యాఖ్యలు తెలంగాణ మహిళా లోకాన్ని బాధ కలిగించే విధంగా ఉన్నాయి. దీన్ని మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించి విచారణ ప్రారంభించింది అంటూ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారదా ట్వీట్ చేశారు. ఇక ఇదే అంశంపై నేడు కేటీఆర్ కు నోటీసులు అందే అవకాశం ఉంద‌ని స‌మాచారం. దీంతో ఉచిత బస్సు ప్రయాణంపై సెటైర్ వేయబోయి మహిళలపై అసభ్యకర కామెంట్స్‌ చేసిన కేటీఆర్ తన తప్పు తెలుసుకున్నారు. నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా కామెంట్ చేశాను. వాటి వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్థాపం కలిగితే నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. నాకు అక్క చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు అని కేటీఆర్ ట్వీట్ చేశారు.