హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనం చేయరాదంటూ ఓ పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించాడు. హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనం చేయడమంటే.. కోర్టును ధిక్కరించినట్టేనని, తన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోవాలని, హుస్సేన్ సాగర్‌లో గణపతి నిమజ్జనం చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. ఈ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు పరిశీలించిన హైకోర్టు హుస్సేన్ సాగర్ నిమజ్జన వేడుకలకు అనుమతించింది. కంటెమ్ట్ పిటిషన్ మెయింటనెబుల్ కాదన్నా హైకోర్టు.. కోర్టు ధిక్కరణపై ఆధారాలు చూపించాలని పిటిషనర్‌ను ఆదేశించింది. పిటిషనర్ ఆధారాలు చూపించలేకపోవడంతో కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసింది. కంటెంప్ట్ పిటిషన్ మెయింటెనెబుల్ కాదని పేర్కొంది. కాబట్టి, గతంలో ఇచ్చిన ఆదేశాలే కొనసాగుతాయని స్పష్టం చేసింది. ట్యాంక్ బండ్ పై గణేష్ విగ్రహాల నిమజ్జన ప్రక్రియకు సంబంధించి 2021లో కోర్టు ఇచ్చిన ఆదేశాలే అమల్లో ఉంటాయని వివరించింది.
గతంలో కోర్టు ఆదేశాలు వెలువరించేటప్పుడు హైడ్రా లేదని వివరించింది. అలాంటప్పుడు హైడ్రాను ఇప్పుడు ఎలా పార్టీ చేయగలమని ప్రశ్నించింది. గతంలో గణపతి నిమజ్జనం సమయంలో అధికారుల చర్యలపై తాము సంతృప్తి చెందామని తెలిపింది. అయితే, పీవోపీ విగ్రహాల తయారీపై తాము నిషేధం విధించలేమని చెప్పింది. కానీ, పీవోపీ విగ్రహాలున తాత్కాలిక పాండ్స్‌లో కూడా నిమజ్జనం చేసుకోవచ్చని పేర్కొంది. ఒక వేళ ప్రత్యేక ఆదేశాలు కావాలనుకుంటే పిటిషనర్ రిట్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సూచించింది.
ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో గణేష్ విగ్రహ నిమజ్జనాన్ని సజావుగా నిర్వహించేందుకు జీహెచ్‌ఎంసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ ప్రయత్నాల్లో భాగంగా హైదరాబాద్‌లోని వివిధ జోన్లలో దాదాపు 73 ఇమ్మర్షన్ పాయింట్లను వివిధ సైజుల్లో ఏర్పాటు చేసినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. ఇమ్మర్షన్ జోన్ల జాబితా క్రింది విధంగా ఉంది:
పోర్టబుల్ చెరువులు:
ఎల్బీ నగర్ జోన్: AS రావు నగర్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, సచివాలయ నగర్ ఆఫీసర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ గ్రౌండ్స్, హయత్ నగర్ MRO ఆఫీస్, వనస్థలిపురం, సుమ థియేటర్ క్రికెట్ గ్రౌండ్స్, స్విమ్మింగ్ పూల్ దగ్గర, మున్సిపల్ ఆఫీస్ వెనుక ప్రభుత్వ కళాశాల మైదానం
చార్మినార్: రియాసత్‌నగర్ శివాలయం గ్రౌండ్స్, లక్ష్మీ నారాయణ ప్లేగ్రౌండ్స్, జంగమ్మెట్
ఖైరతాబాద్: రామ్ లీలా గ్రౌండ్స్, చింతల్ బస్తీ, 100 అడుగుల రోడ్డు, SBA గ్రౌండ్స్ ఎదురుగా, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, అమీర్‌పేట్ ప్లేగ్రౌండ్
సెరిలింగంపల్లి: పీజేఆర్ స్టేడియం, చందానగర్, సఖి చెరువు, పటాన్చెరు
కూకట్‌పల్లి: చిత్రమ్మ దేవాలయం, వివేకానంద నగర్, HMT ఓపెన్ ప్లేస్, ESI హాస్పిటల్
సికింద్రాబాద్: ఎన్టీఆర్ స్టేడియం, ఆజాద్ నగర్, అంబర్‌పేట్ డంప్ యార్డ్ సమీపంలో, చిల్లకల్‌గూడ మున్సిపల్ గ్రౌండ్స్.
ఎస్కలేటర్ చెరువులు:
ఎల్బీ నగర్: దేవేందర్ నగర్ రోడ్, హుడా భాతీ నగర్ పార్క్ , ఎన్టీఆర్ నగర్ కూరగాయల మార్కెట్
చార్మినార్: ఫ్రెండ్స్ కాలనీ హోటల్ కోర్టు, SBH కాలనీ సైదాబాద్, బతుకమ్మ బావి కందికల్ గేట్, గౌలిపుర, వైశాలి నగర్, బావికుంట, మైలార్‌దేవ్‌పల్లి, ఉప్పర్‌పల్లి శివాజీ హిల్స్, మూసీ నది సమీపంలో, పాతికుంట , రాజన్న బావి.
ఖైరతాబాద్: పిల్లర్ నంబర్ 54, PVNR ఎక్స్‌ప్రెస్‌వే, రామ్ లీలా గ్రౌండ్స్, చింతల్ బస్తీ, జంసింగ్ టెంపుల్, గుడిమల్కాపూర్, దోభీ ఘాట్, 100 అడుగుల రోడ్డు, సనత్‌నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, మారుతీనగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, నెక్నాంపూర్, నెక్లెస్ రోడ్
సెరిలింగంపల్లి: గోపనపల్లి రోడ్డు సమీపంలోని రంగనాయక దేవాలయం, రేగులకుంట చెరువు, సఖి చెరువు, దుర్గం చెరువు, మల్కం చెరువు, నల్గొండ చెరువు, గోపి చెరువు, గంగారం చెరువు, కైదమ్మ కుంట, గుర్నాథం చెరువు, రాయి సముద్రం.
కూకట్‌పల్లి: HMT నగర్ ఓపెన్ ప్లేస్ ESI హాస్పిటల్ సమీపంలో, ముల్కత్వ చెరువు, IDL బేబీ చెరువు, బాలాజీ నగర్, బోయిన చెరువు బేబీ చెరువు, ప్రగతి నగర్ ఆల్విన్ కాలనీ హైదరానగర్, లింగం చెరువు, కొత్త చెరువు,
సికింద్రాబాద్: ఎన్టీఆర్ స్టేడియం, చెర్లపల్లి చెరువు, కాప్రా చెరువు, నల్ల చెరువు, నాగోల్ చెరువు, మన్సూరాబాద్ చెరువు, సంజీవయ్య పార్కు, సఫిల్ గూడ, బండ చెరువు.