తెలంగాణలో లో 2050 నర్సుల పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సెప్టెంబరు 18న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ లో భాగంగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ డైరెక్టర్ .. మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్లలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో 332 నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులను కూడా ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అలానే ఆయుష్ శాఖలో 61, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో 80 మంది నర్సింగ్ ఆఫీసర్ల పోస్టుల భర్తీతో పాటు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ లో ఒక నర్సింగ్ ఆఫీసర్ పోస్టును కూడా భర్తీ చేయనున్నారు.
విద్యార్హత: జనరల్ నర్సింగ్ మిడ్ వైఫరీ (GNM) లేదా బీఎస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. అనుభవం ఉన్నవారికి ఎంపికలో ప్రాధాన్యం ఉంటుంది.
వయోపరిమితి: 08.02.2024 నాటికి 18-46 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. దివ్యాంగులకు 10 సంవత్సరాలు; ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ సర్టిఫికెట్ ఉన్నవారికి 3 సంవత్సరాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలపాటు సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ఆధారంగా. మొత్తం 100 పాయింట్లకు ఎంపిక విధానంల ఉంటుంది. ఇందులో రాతపరీక్షకు 80 పాయింట్లు ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థల్లో పనిచేసిన కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసుకు 20 పాయింట్ల వెయిటేజీ ఉంటుంది.
జీతం: రూ.36,750 – రూ.1,06,990
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 28.9.2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 14.10.2024 5.00 pm
దరఖాస్తుల సవరణ: 16.10.2024 (10.30 AM) 17.10.2024 to 5.00 PM
ఆన్‌లైన్ పరీక్ష (సీబీటీ) తేదీ: 17.11.2024.