60 లక్షల సభ్యత్వాలు నమోదు

KTR About Party Membership, KTR About Party Membership Drive, Mango News Telugu, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019, TRS Working President KTR, TRS Working President KTR About Party, TRS Working President KTR About Party Membership, TRS Working President KTR About Party Membership Drive

టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం పై సమీక్ష చేపట్టారు. టిఆర్ఎస్ పార్టీ ఈ సభ్యత్వ నమోదులో 60 లక్షల మంది సభ్యులను చేర్చుకుందని తెలిపారు. నేటితో సభ్యత్వ నమోదుకు గడువు ముగిసిందని చెప్పారు. భారీ స్థాయిలో ప్రజలు సభ్యత్వ నమోదు చేసుకునేలా పార్టీ నాయకులు కృషి చేసారని అందుకు వారిని అభినందిస్తునట్టు చెప్పారు. ఈ నమోదు కార్యక్రమంలో గజ్వేలు, వర్ధన్నపేట నియోజకవర్గాలు ముందువరుసలో ఉన్నాయన్నారు. ఆక్టోబరులో వచ్చే దసరా పండగ నాటికీ అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ప్రారంభం అవ్వాలని నాయకులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో తెరాస బలమైన పార్టీగా అవతరించిందని, బీజేపీ పార్టీకి కేవలం 12 లక్షలమందే సభ్యులున్నారని కేటీఆర్ వెల్లడించారు.

 

[subscribe]
[youtube_video videoid=x9yRseyXlSE]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here