హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన చేసింది. రాబోయే రెండు రోజులు సైతం భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్, నగరం పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. వర్షాన్ని దృష్టిలో పెట్టుకొని.. వీలైనంతవరకూ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ వర్షం రావడానికి బలమైన కారణం ఉంది. తూర్పు ఆసియా దేశాల పక్కన సముద్రాల్లో భయంకరమైన సుడులు తిరుగుతున్నాయి. వాటి వల్ల గాలులు బలంగా ఉన్నాయి. అందువల్ల మేఘాలు పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాలపైకి వస్తున్నాయి. రానున్న రెండు రోజులు ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సూచించింది.
హైదరాబాద్‌లో ఆల్రెడీ చాలా చోట్ల వర్షం పడుతోంది. యాప్రాల్, అల్వాల్, కాప్రా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సికింద్రాబాద్, బేగంపేట, కూకట్‌పల్లి, మధ్య, తూర్పు హైదరాబాద్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం వర్షం కురుస్తుంది. హైదరాబాద్‌తోపాటూ.. ఉత్తర, మధ్య తెలంగాణలో కూడా ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవి సాయంత్రం 8 గంటల వరకూ కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కారణంగా.. రోజంతా మేఘాలు తెలంగాణలో ఉండబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉదయం నుంచి కోస్తా, ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అందువల్ల ఏపీ ప్రజలు కూడా ఈ వర్షాలను దృష్టిలో పెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి హైదరాబాద్ జలయమం అయ్యింది. కొన్ని ప్రాంతాల్లో 60 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. బన్సీలాల్‌పేటలో అత్యధికంగా 68.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గన్‌ఫౌండ్రీలో 68.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉప్పల్‌లో 67.0, బేగంబజార్‌లో 62.8, నాచారంలో 61.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. ఎస్‌డీఆర్ఎఫ్, మున్సిపల్ అధికారులను సిద్ధం చేశారు. వర్షం కారణంగా నీరు రోడ్లపై నిలవకుండా ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని క్షేత్ర స్థాయి సిబ్బందిని ఉన్నతాధికారులు ఆదేశించారు. మరోవైపు ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు.