ఫార్ములా ఈ-రేసింగ్, సచివాలయ భద్రత ఏర్పాట్లుపై సీఎస్ శాంతి కుమారి ఉన్నతస్థాయి సమావేశం

Telangana CS Shanti Kumari held High Level Meeting on Formula E-Racing and Secretariat Security Arrangements,CS Shanti Kumari High Level Meeting,Formula E-Racing,Secretariat Security Arrangements,Mango News,Mango News Telugu,Formula E Teams,Formula 1 E Racing,Formula E Drivers,Formula E Gen 3,Formula E Racing Attack Mode,Formula E Racing Brooklyn,Formula E Racing Cars,Formula E Racing Game,Formula E Racing Live,Formula E Racing Rules,Formula E Racing Schedule,Formula E Racing Speeds,Formula E Racing Teams,Formula E Racing Hyderabad,Formula E Standings,Formula E Top Speed,Mahindra Formula E Racing

ఫిబ్రవరి 17వ తేదీన ప్రారంభించే నూతన డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయం భవన సముదాయంలో భద్రతా ఏర్పాట్లు, ఫిబ్రవరి 11వ తేదీన జరుగనున్న ఫార్ములా ఈ-రేసింగ్ ఏర్పాట్లపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి అధ్యక్షతన మంగళవారం బిఆర్కేఆర్ భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. డీజీపీ అంజనీ కుమార్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, నగర పోలీస్ కమీషనర్ సి.వి.ఆనంద్, ఎస్పీఎఫ్ డీజీ ఉమేష్ ష్రాఫ్, అడిషనల్ డీజీ సంజయ్ కుమార్ జైన్, ఫైర్ సర్వీసుల డీజీ నాగి రెడ్డి, ఇంటలిజెన్స్ అడిషనల్ డీజీ అనిల్ కుమార్, ఈ.ఎన్.సి గణపతి రెడ్డి లతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే:

  • ఫిబ్రవరి 11న జరుగనున్న అత్యంత ప్రతిష్టాత్మక ఫార్ములా ఈ-రేస్ నిర్వహణ సందర్బంగా తెలుగుతల్లి ఫ్లై ఓవర్ నుండి ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ వరకు, మింట్ కాంపౌండ్ నుండి ఐ-మాక్స్ వరకు రోడ్ లను
  • ఫిబ్రవరి 5 వతేదీ నుండి ట్రాఫిక్ మూసివేయడం జరుగుతుంది. ప్రత్యామ్నాయ మార్గాలపై నగరవాసులకు అవగాహన కల్పించాలి.
  • ఫార్ములా ఈ-రేస్ సందర్బంగా సచివాలయ పనులకు అంతరాయం కలుగకుండా ప్రత్యామ్నాయ మార్గాల ఏర్పాటు.
  • ఫిబ్రవరి 17 వ తేదీన ప్రారంభించుకోనున్న డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయానికి విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని నిర్ణయం.
  • పోలీస్ శాఖ, రోడ్లుభవనాలు, జీఏడీ, తెలంగాణ స్పెషల్ పోలీస్, ఐటి తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలి.
  • 3 కంపెనీల తెలంగాణ స్పెషల్ పోలీస్, 300 సిటీ పోలీస్ అధికారులతో భద్రతా ఏర్పాట్లు.
  • సిటీ ట్రాఫిక్ విభాగం నుండి 22 ట్రాఫిక్ అధికారుల కేటాయింపు.
  • భద్రతా పరమైన పరికరాలైన బ్యాగేజ్ స్కానర్లు, వెహికిల్ స్కానర్లు, బాడీ స్కానర్లు, ఇతర పరికరాలను సమకూర్చుకోవాలని నిర్ణయం.
  • మొత్తం 28 ఎకరాల లో మొత్తం 9.42 చ.అ.విస్తీర్ణంలో నిర్మించిన ఈ నూతన సచివాలయంలో 560 కార్లు, 900 లకు పైగా ద్విచక్ర వాహనాల పార్కింగ్ కు సదుపాయం.
  • సచివాలయం చుట్టూ ఆరు సెంట్రీ పోస్టుల ఏర్పాటు. 300 సీసీ టీవీ లద్వారా భద్రతా పర్యవేక్షణ.
  • సీసీటీవీలతో పాటు ఇతర భద్రతా పరమైన చర్యల పర్యవేక్షణకు ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు.
  • ఆధునాతన కార్పొరేట్ కార్యాలయాల మాదిరిగా సచివాలయంలోకి వచ్చి వెళ్లే సందర్శకులకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులతో కూడిన మానిటరింగ్.
  • 34 సిబ్బంది తో రెండు ఫైర్ ఇంజన్ల ఏర్పాటు.
  • సచివాలయ భవనంలో ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు.
  • దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు.
  • 6వ అంతస్తు మినహా అన్ని అంతస్తులకు సందర్శకులకు పరిమితమైన అనుమతి.
  • ఇప్పటికే జలమండలి ద్వారా నీటి సరఫరా ఏర్పాటు. సీవరేజ్ పనుల పురోగతి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − two =