విరాట్ కోహ్లీ మళ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సిబి)కి కెప్టెన్ అవుతాడా? అలాంటి అవకాశం ఉందని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇష్టం లేకుండా వదులుకున్న నాయకత్వాన్ని వెనక్కి తీసుకుంటారా? అయితే అతడిని మినహాయిస్తే ఫ్రాంచైజీ ముందు మరో మంచి ఆప్షన్ లేదనే మాట వినిపిస్తోంది.
బహుశా ఏ ఫ్రాంచైజీలో నాయకుడి గురించి అలాంటి గందరగోళం లేదు. 2008 నుంచి ఇప్పటి వరకు ఒక్క ఐపీఎల్ టోర్నీని కూడా గెలవని ఆర్సీబీ.. ఇప్పుడు కెప్టెన్ గా ఎవరిని ఎంపిక చేయాలనే చర్చ నడుస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. ఇప్పుడు కెప్టెన్ గా ఉన్న ఫాఫ్ డుప్లెసిస్ వయసు 40 ఏళ్లు. ఈ ఏడాది గానీ, వచ్చే ఏడాది గానీ ఆయన్ను నాయకుడిగా చేసేందుకు ఎలాంటి అడ్డంకి లేదు. ఎందుకంటే అతనిలో ఇంకా క్రికెట్ ఆడగలిగే సత్తా ఉంది. కానీ RCB భవిష్యత్తు దృష్ట్యా అతడిని ఎక్కువ కాలం కెప్టెన్‌గా ఆడించడం అసాధ్యం.
డుప్లెసిస్ కెప్టెన్సీ కష్టమే
ఫాఫ్ డుప్లెసిస్ కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో సెయింట్ లూసియా కింగ్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.. కానీ ఫాఫ్ వయస్సు రిత్యా RCB IPL రిటెన్షన్ స్లాబ్ లో మళ్లీ తీసుకునే అవకాశం తక్కువే.. దీంతో RCB కొత్త కెప్టెన్‌ని వెతికే పనిలో పడింది. ఇక ఈ వేలం ప్రక్రియలో రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ డ్రాప్ చేస్తేనే RCB అతన్ని తీసుకునే అవకాశముంది. అన్ని అనుకున్నట్లు జరిగితే రోహిత్ బెంగళూరు జట్టుకు కెప్టెన్‌గా కూడా మారవచ్చు. RCB అభిమానులు కూడా ఇదే కోరుకుంటున్నారు. రోహిత్-విరాట్ కాంబినేషన్ బెంగుళూరుకు కప్ తీసుకురాగలదని అభిమానుల లెక్క. అయితే అలాంటి అవకాశాలు తక్కువే.
ఇక బెంగళూరు జట్టులోకి కేఎల్ రాహుల్ ను తీసుకొచ్చి కెప్టెన్ గా చేస్తారని గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఇది సాధ్యం కాకపోతే జట్టులోని యువ ఆటగాళ్లలో ఒకరిని కెప్టెన్‌గా ఎంచుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి కష్టం. దీంతో ఆర్సీబీ కి ఉన్న ఏకైక ఆఫ్షన్ విరాట్ కోహ్లిని. కెప్టెన్‌గా వరుస వైఫల్యాలతో టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లి.. 2021లో ఆర్సీబీ కెప్టెన్సీని వదిలిపెట్టాడు. బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాల్సి ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశాడు.
ఆర్సీబీకి ఏకైక ఆప్షన్ విరాట్
విరాట్ ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. పరిస్థితులు కూడా మారాయి. అందుకే ఫ్రాంచైజీ మళ్లీ విరాట్ కోహ్లీకి పగ్గాలు అప్పజెప్పిన ఆశ్చర్యం లేదు. గతంలో డుప్లెసిస్ అందుబాటులో లేనప్పుడు కోహ్లి జట్టుకు నాయకత్వం వహించాడు. మళ్లీ కెప్టెన్‌గా మారితే ఆర్సీబీ జట్టుకు అది అదనపు బలంగా మారడం ఖాయం. అంతేకాదు ఫ్రాంచైజీకి కెప్టెన్సీ తలనొప్పి తీరినట్లే. ఈ సందర్భంలో, రాబోయే మెగా వేలంలో, నాయకత్వం గురించి ఆలోచించకుండా జట్టును నిర్మించడానికి ఆటగాళ్లను తీసుకోవడంపై దృష్టి పెడితే సరిపోతుంది. ఇటు కెప్టెన్‌గా తన సత్తాను నిరూపించుకునేందుకు విరాట్ కోహ్లీకి మరో అవకాశం లభించనుంది. అయితే డుప్లెసిస్ ఆర్సీబీ కెప్టెన్‌గా కొనసాగడంలో తప్పేమిటని ఇప్పటికే ప్రశ్నించిన విరాట్ కోహ్లీ ఇప్పుడు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు అంగీకరిస్తారా అనేది మరో ప్రశ్న.