టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కొడుకు ఆర్యన్ అమ్మాయిగా మారిపోయాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవలే హార్మోన్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేయించుకున్న ఆర్యన్.. ఇప్పుడు తనను తాను ట్రాన్స్ పర్సన్‌గా పరిచయం చేసుకున్నాడు. 10 నెలల శస్త్రచికిత్స తర్వాత, అతను మళ్లీ సోషల్ మీడియాలోకి వచ్చాడు. సంజయ్ బంగర్ కుమారుడు ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశాడు. అబ్బాయి నుంచి అమ్మాయిగా మారే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపాడు ఆర్యన్.
ఆర్యన్ గా ఉన్న తన పేరును అనయ బంగర్ గా మార్చుకున్నాడు. చిన్న వయసు నుంచే క్రికెట్ నాలో భాగంగా ఉంది. మా నాన్న (సంజయ్ బంగర్) ఆడే క్రికెట్ ను చూస్తూ పెరిగాను. ఆయనలాగే నేను క్రికెటర్ అవ్వాలనుకున్నా. అందుకోసం ఎంతో నిబద్దతతో కష్టపడ్డాను. మా నాన్న లాగే ఏదో ఒక రోజు నా దేశానికి క్రికెట్ లో ప్రాతినిధ్యం వహిస్తానని భావించాను. అయితే క్రికెట్ ను వదిలేస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. లింగ మార్పిడి తర్వాత నా శరీరంలో అనేక మార్పులు జరుగుతున్నాయి. శరీరతత్వం మారుతోంది. శక్తి కూడా తగ్గుతుంది. ఈ పరిస్థితిలో నేను క్రికెట్ ను ఆడటం అసాధ్యంగా మారింది’ అంటూ చెప్పుకొచ్చాడు. కోహ్లీ, ధోనిలతో కలిసి దిగిన ఫోటోలను కూడా షేర్ చేశారు.
సంజయ్ బంగర్ 2001 నుంచి 2004 మధ్య టీమిండియాకు టెస్టు, వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. బంగర్ జాతీయ జట్టు తరపున 12 టెస్ట్ మ్యాచ్‌లు మరియు 15 ODIలు ఆడాడు. అతను 29.4 సగటుతో 470 టెస్ట్ పరుగులు మరియు 13.8 సగటుతో 180 ODI పరుగులు చేశాడు. అంతేకాకుండా ఐపీఎల్ లో 2008, 2009 సీజన్లలో ఆడాడు కూడా. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ లకు కోచ్ గా పని చేశాడు. టీమిండియా కోచింగ్ స్టాఫ్ లో సభ్యుడిగా ఉన్నాడు. క్రికెట్ కామెంటేటర్ గా కూడా పని చేశాడు.