భవిష్యత్తుపై అనుమానాలు, అపోహలు గురించి తెలుసుకోవాలంటే తెలుగువారికి గుర్తకు వచ్చేది పోతులూరి విరబ్రహ్మేద్ర స్వామి చెప్పిందే. ఎందుకంటే ఆయన చెప్పిన వాటిలో ఇప్పటికే చాలా జరిగాయి. అయితే ఇప్పుడు అమెరికాకు చెందిన అమెజాన్ కంపెనీ సోషల్ అసిస్టెన్స్.. ఆ దేశ ప్రజలకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది.
రాబోయే దశాబ్దంలో అమెరికా పేరు కనిపించదని జోస్యం చెప్పింది. లూసీ బ్లేక్ అనే కంటెంట్ క్రియేటర్ వర్చువల్ అసిస్టెంట్..ఈ వీడియోను షేర్ చేయగా..అది ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
అవును.. అమెరికా ఉనికి ఫిబ్రవరి 20వ తేదీ 2031 వరకే ఉంటుందని అలెక్సా వెల్లడించింది. డిసెంబర్ ప్రారంభంలో అలెక్సా వీడియోను రికార్డు చేయగా.. నెల రోజులుగా అలెక్సా భవిష్యవాణి అక్కడ తెగ వైరల్ అవుతోంది. దీనిని రెండు మిలియన్లకుపైగానే నెటిజన్లు వీక్షించారు. అయితే దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
అయితే అలెక్సా ఇది ఒక్కసారే చెప్పిందని.. తర్వాత అడుగుతుంటే మాత్రం నాకు తెలియదు అని సమాధానం చెబుతూ వస్తోంది. అందుకే చాలామంది అలెక్సా సమాధానం ముందే.. ప్రోగ్రామ్ చేయబడి ఉందని వాదిస్తున్నారు. మరి కొందరు మాత్రం ఇది జోక్‌గా చెబుతూ కామెంట్ చేస్తున్నారు.
అయితే సాంకేతికవల్ల అప్పుడప్పుడూ ఇలాంటి తప్పులు జరిగే అవకాశం ఉంటుందని..అంత మాత్రాన ఈ పుకార్లను నమ్మి భయపడొద్దని అక్కడి అధికారులు అంటున్నారు. అలెక్సా వంటి వాయిస్ అసిస్టెంట్‌లు.. కొన్నిసార్లు భ్రమలు, తప్పుల ప్రేరణలు చేయొచ్చని.. దానిని వాస్తవంగా జరుగుతుందన్న భ్రమలో ఉండకుండా జాగ్రత్తపడాలని సూచిస్తున్నారు.