ఐపీఎల్‌ లో కొత్తగా లక్నో, అహ్మదాబాద్‌ ఫ్రాంఛైజీలు, బీసీసీఐ ప్రకటన

bcci, BCCI Announces Bidders, BCCI Announces Bidders for Two New Indian Premier League Franchises, BCCI announces the successful bidders for two new IPL teams, Bidders for Two New Indian Premier League Franchises, indian premier league, IPL New Teams, IPL New Teams Auction, IPL New Teams Auction HIGHLIGHTS, IPL Team Auction, ipl teams 2021 list, Mango News, New Indian Premier League Franchises, New IPL teams

ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌)లో కొత్తగా మరో రెండు జట్లు చేరాయి. దీంతో ప్రస్తుతం ఐపీఎల్ లో జట్ల సంఖ్య 10కి చేరింది. ఈ మేరకు సోమవారం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటన చేసింది. లక్నో ఫ్రాంఛైజీ కోసం ఆర్పీఎస్జీ గ్రూప్‌ రూ.7,090 కోట్లు మరియు అహ్మదాబాద్‌ ఫ్రాంఛైజీ కోసం సీవీసీ క్యాపిటల్‌ పార్ట్‌నర్స్‌ రూ.5,625 కోట్లు చెల్లించాయని బీసీసీఐ ప్రకటించింది. పోస్ట్-బిడ్ ఫార్మాలిటీలను పూర్తి చేసిన తర్వాత కొత్త ఫ్రాంచైజీలు 2022 సీజన్ నుండి ఐపీఎల్ లో పాల్గొంటాయని పేర్కొన్నారు. ఐపీఎల్ 2022 సీజన్ పది జట్లను కలిగి ఉంటుందని మరియు మొత్తం 74 మ్యాచ్‌లను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇందులో ప్రతి జట్టు హోమ్ స్టేడియంలో 7 మరియు బయట 7 మ్యాచ్‌లను ఆడుతుందని చెప్పారు.

ముందుగా రెండు కొత్త ఫ్రాంచైజీలను సొంతం చేసుకోవడం మరియు నిర్వహించే హక్కును పొందడానికి ఐపీఎల్ యొక్క పాలక మండలి టెండర్ కు ఆహ్వానాన్ని జారీ చేసింది. టెండర్ ప్రక్రియకు అనుగుణంగా, వివిధ ఆసక్తిగల సంస్థలు కొత్త ఫ్రాంచైజీల కోసం తమ బిడ్‌లను సమర్పించాయి. సోమవారం దుబాయ్‌లో ఆసక్తిగల సంస్థలు అధికార ప్రతినిధులు ఈ బిడ్‌లను సమర్పించారు. అనంతరం కొత్త జట్లపై బీసీసీఐ ప్రతినిధులు సమావేశం నిర్వహించి అధికారికంగా ప్రకటన చేశారు. కేవలం రెండు కొత్త జట్లతోనే బీసీసీఐ ఖాతాలో రూ.12,715 కోట్లు చేరాయి. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ తదుపరి సీజన్ నుండి రెండు కొత్త జట్లను స్వాగతించడం పట్ల బీసీసీఐ సంతోషంగా ఉందని చెప్పారు. జట్లను దక్కించుకున్న ఆర్పీఎస్జీ వెంచర్స్ లిమిటెడ్ మరియు ఇరేలియా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కు అభినందనలు తెలిపారు. ఐపీఎల్ ఇప్పుడు భారతదేశంలోని లక్నో మరియు అహ్మదాబాద్‌ వంటి రెండు కొత్త నగరాలకు వెళ్తుందని గంగూలీ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =