మీ ఆధార్ కార్డ్‌లో ఎలాంటి డాక్యుమెంట్ సమాచారాన్ని ఉచితంగా అప్‌డేట్ చేయాలనుకుంటున్నారా? అయితే వేగంగా దాన్ని పూర్తి చేయండి, ఎందుకంటే డిసెంబర్ 14వ తేదీతో ఈ అవకాశం ముగుస్తుంది. తర్వాత, ఆధార్ సమాచారాన్ని అప్‌డేట్ చేయడానికి రుసుము చెల్లించాల్సి ఉంటుంది. UIDAI (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఈ ఏడాది ప్రారంభంలో ఉచిత అప్‌డేట్ సేవను అందుబాటులోకి తీసుకువచ్చింది.
గడువును ఇప్పటికే కొన్ని దఫాలు పొడిగించారు.. మార్చి నుంచి జూన్ వరకు, తర్వాత సెప్టెంబర్ వరకు, ఆపై డిసెంబర్ 14 వరకు. అయితే ఈసారి కూడా పొడిగింపు ఉంటుందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. ప్రస్తుతం చిరునామా, ఫోన్ నంబర్, పేరు వంటి వివరాలను UIDAI వెబ్‌సైట్ ద్వారా ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ ఆధార్ అప్‌డేట్ స్టెప్స్:
మొదట myaadhaar.uidai.gov.in వెబ్‌సైట్‌కు వెళ్ళండి.
లాగిన్ బటన్పై క్లిక్ చేయండి.
మీ ఆధార్ నంబర్ మరియు క్యాప్చా కోడ్ నమోదు చేసి, OTP ద్వారా లాగిన్ అవ్వండి.
“డాక్యుమెంట్ అప్‌డేట్” ఎంపికను ఎంచుకుని, ప్రూఫ్ డాక్యుమెంట్స్‌ని అప్‌లోడ్ చేసి, సమర్పించండి.
అభ్యర్థన రసీదు సంఖ్యను ఉపయోగించి మీ అప్‌డేట్ స్టేటస్‌ని ట్రాక్ చేయండి.
ఇంట్లోనే ఆధార్‌ను అప్‌డేట్ చేయడం ఎలా?
ఇంట్లో కూర్చుని ఆధార్ డిటైల్ అప్‌డేట్ చేయడం ఇప్పుడు సులభం. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (IPPB) సేవలు ఈ సౌకర్యాన్ని అందిస్తున్నాయి.
IPPB వెబ్‌సైట్లోకి వెళ్లి, నాన్ IPPB బ్యాంకింగ్ విభాగం పై క్లిక్ చేయండి.
డోర్‌స్టెప్ బ్యాంకింగ్ ఎంపికలో “ఆధార్ మొబైల్ అప్‌డేట్”ను ఎంచుకోండి.
ఫారమ్ నింపి సమర్పించండి.
పోస్టల్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మీ ఇంటికి వచ్చి బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేస్తారు.
గమనిక: ఆన్‌లైన్‌లో మొబైల్ నంబర్ మరియు బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేయడానికి ఎన్‌రోల్‌మెంట్ కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది.