ఏఐ గుట్టు రట్టు చేస్తుందట..బీకేర్ ఫుల్

ELSS, LIC,HRA,AI ,Submitting fake rent receipt to IT, AI trick,AIS Form , Form-26 with AS Form-16, I-T Act, tax liability, Income Tax, Tax paying, Annual income statement, Mango News Telugu, Mango News
ELSS, LIC,HRA,AI ,Submitting fake rent receipt to IT, AI trick,AIS Form , Form-26 with AS Form-16

ప్రతీ ఒక్కరూ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించడం తప్పనిసరి అయింది. దీనికోసం ఐటీఆర్‌లో ఈఎల్ఎస్ఎస్, ఎల్ఐసీ,   పన్ను ఆదా పథకాలు, పిల్లల ట్యూషన్ ఫీజు రసీదులు , రెంట్  రిసీట్ వంటివి సమర్పిస్తుంటారు.  వీటి ఆధారంగానే మీరు ట్యాక్స్ ఎంత చెల్లించాలో కంపెనీ లెక్కిస్తుంది. ఇది మీ శాలరీ నుంచి వచ్చే మూడు నెలల వరకు తీసివేయబడుతుంది. కానీ ఫైనల్ తగ్గింపు మాత్రం ఆదాయపు పన్ను శాఖ ద్వారానే జరుగుతుంది. మీకు ట్యాక్స్ రిటర్న్ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. అయితే పన్ను ఆదా చేయడానికి కొంతమంది నకిలీ అద్దె రశీదులు సమర్పిస్తుంటారు. కానీ ఇప్పుడు  ఆదాయపు పన్ను శాఖ నకిలీ రసీదులను ఈజీగా పసిగట్టేస్తుంది..

మనం ఇప్పుడు ఏ పని చేయాలన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పైనే ఆధారపడుతున్నాం. అలా ఐటీ శాఖ కూడా నకిలీ అద్దె రసీదులను గుర్తించడానికి  ఏఐని ఉపయోగిస్తోంది. ఇది AIS ఫామ్ , ఫామ్-26AS ఫామ్-16తో అలైన్మెంట్ చేయబడి ఉంటుంది. అన్ని పాన్ కార్డ్ సంబంధిత లావాదేవీలు ఈ ఫామ్‌లలో నమోదు చేయబడతాయి. కాబట్టి ట్యాక్స్ చెల్లించాలనుకునేవాళ్లు రెంట్ రసీదు ద్వారా ఇంటి అద్దె అలవెన్స్‌ను క్లెయిమ్ చేసినప్పుడు, ఆదాయపు పన్ను శాఖ వారి క్లెయిమ్ ఈ ఫామ్‌లతో సరిపోతుందో లేదో తనిఖీ చేస్తుంది. ఇందులో ఏమైనా తేడాలుంటే వెంటనే అప్రమత్తమవుతారు.

ఉద్యోగులు కంపెనీ నుంచి హెచ్ఆర్ఏ పొందినట్లయితే మాత్రమే హెచ్ఆర్ఏ మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది. ఇది ఇంటి అద్దె అలవెన్స్‌కు సంబంధించిన నియమం. ఒకవేళ ఉద్యోగి సంవత్సరానికి రూ.  1 లక్ష కంటే ఎక్కువ అద్దె చెల్లించేవారయినతే తప్పకుండా  తమ ఇంటి యజమాని  పాన్ నంబర్‌ను కూడా అందించాలి.హెచ్‌ఆర్‌ఏ కింద క్లెయిమ్ చేసిన మొత్తానికి..ఇంటి యజమాని పాన్ నంబర్‌కు పంపిన మొత్తంతో  ఐటీ శాఖ   పోల్చి చూస్తుంది. ఈ రెండింటి మధ్య తేడా ఉంటే ఐటీ శాఖ మీకు నోటీసు పంపుతుంది. లక్ష కంటే తక్కువ ఉంటే హౌజ్ ఓనర్ పాన్ నంబర్ లేకుండానే హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసుకోవచ్చు. దీనిని ఐటీ శాఖ తనిఖీ చేయదు.

ట్యాక్స్ సేవింగ్ టాపిక్ వచ్చినప్పుడల్లా ముందుగా అందరికీ వచ్చే ఆలోచన నగదు లావాదేవీ గురించే.  ఒకవేళ మీరు నగదు రూపంలో రెంట్ చెల్లించామని చెబితే.. సమాధానం కోరుతూ ఇంటి యజమానికి ఆదాయపు పన్ను శాఖ   నోటీసు పంపవచ్చు. అప్పుడు ఇంటి యజమాని నిజం చెబితే  మాత్రం ట్యాక్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే నకిలీ అద్దె రశీదులు ఐటీఆర్‌కు సమర్పించకుండా ఉంటేనే మంచిది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − 4 =