ఆస్కార్‌ రేసులో తప్పుకున్న లాపతా లేడీస్‌ సినిమా

Lapatha Ladies Movie Out Of Oscar Race

భారత్ నుంచి ఆస్కార్ 2025 అవార్డ్స్ కోసం ఈసారి లాపతా లేడీస్ మూవీ అధికారికంగా ఎంపికవడంతో భారతీయులు కచ్చితంగా ఆ సినిమా.. ఏదొక అవార్డు తీసుకువస్తుందని భారీగానే ఆశలు పెంచుకున్నారు. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో లపాతా లేడీస్ ఈసారి అవార్డ్ పై ఆశలు రేపింది. కానీ తాజాగా ఈ సినిమా ఆస్కార్ రేసు నుంచి తప్పుకుందన్న వార్తలతో నిరాసకు లోనయ్యారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన లపాతా లేడీస్ మూవీ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుని భారీ విజయాన్ని సాధించింది. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రొడ్యూసర్ గా..ఆయన మాజీ భార్య కిరణ్ రావు డైరక్షన్ చేసిన ఈ సినిమాకు అన్నివర్గాల నుంచి కూడా భారీగా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఈ సినిమాలో స్పర్శ్ శ్రీవాత్సవ, నితాన్షి గోయెల్ కీలకపాత్రలు పోషఇంచారు. అమీర్ ఖాన్ నిర్మించిన లపాతా లేడీస్ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ అవార్డులలో క్రిటిక్స్ ఛాయిస్ విభాగంలో బెస్ట్ ఫిల్మ్ గా నిలిచింది. అంతేకాదు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ తోపాటు.. సుప్రీంకోర్టు 75 ఏళ్ల వేడుకలో భాగంగా ..అడ్మినిస్ట్రేటివ్ భవనంలోని సీ బ్లాక్ లోని ఆడిటోరియంలో ఈ సినిమాను ప్రదర్శించడంపై పెద్ద ఎత్తున చర్చ సాగింది.

ఇక ఈసారి ఆస్కార్ 2025 అవార్డు పోటీలకు లపాతా లేడీస్ భారత్ నుంచి ఎంపికవడంతో.. దీని పేరును లాస్ట్ లేడీస్ అని కూడా మార్చారు. అయితే 2025 ఆస్కార్ రేసు నుంచి ఈ సినిమా ఔట్ అవడంతో భారతీయులు నిరాసకు లోనయ్యారు. టాప్ 10లో స్థానం సాధించడంలో లపాతా లేడస్ విఫలమైంది. ఉత్తమ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీ విభాగంలో షార్ట్ లిస్ట్ చేసిన ఈ టాప్ 10 మూవీల జాబితాలో లాపతా లేడీస్ పేరు లేకపోవడంతో..అధికారికంగా ఈ చిత్రం ఆస్కార్ రేసు నుంచి తప్పుకుంది.

టాప్ 10 లిస్ట్ లో బ్రెజిల్, కెనడాకు చెందిన సినిమాలు నిలిచాయి. అయితే ఆస్కార్‌ అవార్డుల రేసులోకి హిందీ సినిమా అయిన సంతోష్‌ షార్ట్‌లిస్ట్‌ అయిందన్న వార్త భారతీయుల్లో మళ్లీ ఆశలు చిగురించేలా చేస్తోంది. అయితే ఉత్తమ విదేశీ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరిలో సంతోష్ సినిమా షార్ట్‌లిస్ట్‌ అయింది. ఎందుకంటే భారత్‌ నుంచి కాకుండా యూకే నుంచి ఈ సినిమా వెళ్లింది. ఇప్పటికే 77వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో సంతోష్ మూవీ ప్రశంసలు అందుకుంది.

ఉత్తరభారతంలో పరిస్థితులకు అద్దం పట్టేలా సంతోష్ సినిమాను నిర్మించారు. ఈ స్టోరీ లైన్ ఏంటంటే..సంతోష్‌ అనే మహిళకు తన భర్త చనిపోవడంతో ఆయన చేస్తున్న పోలీసు ఉద్యోగం వస్తుంది. అట్టడుగు వర్గానికి చెందిన ఓ బాలిక హత్యకేసు దర్యాప్తులో భాగంగా అవినీతి వ్యవస్థతో సంతోష్ ఎలా పోరాడిందనే కథాంశంతో ఈ మూవీని దర్శకురాలు సంధ్యా పురి తెరకెక్కించారు. అయితే ఈ సినిమాకు అవార్డు వస్తుందో రాదో అన్న విషయం ..మార్చి మూడోతేదీన ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో తేలిపోతుంది. అయితే ఈ సారి ఆస్కార్ కు వెళ్లిన లపాతా లేడీస్, సంతోష్ సినిమాలను మహిళా దర్శకురాళ్లే తీయడం విశేషం.