ఏపీ ప్రభుత్వం ఫిల్మ్‌చాంబర్‌తోనే చర్చలు జరపాలి, వ్యక్తులతో కాదు – సిపిఐ నారాయణ

AP Govt, AP Govt Should Hold Talks Only with The Film Chamber, AP Govt Should Hold Talks Only with The Film Chamber Itself Not To The Persons, AP Govt Should Hold Talks Only with The Film Chamber Itself Not To The Persons Says CPI Narayana, Chiranjeevi And AP CM YS Jagan Meet, Chiranjeevi And AP CM YS Jagan Meet Comments, Chiranjeevi And AP CM YS Jagan Meet News, CPI Narayana, Film Chamber, Film Industry, Film Industry Issues, Latest News Headlines, Mango News

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిల్మ్ చాంబర్‌తో మాత్రమే చర్చలు జరపాలని సీపీఐ నారాయణ సూచించారు. వ్యక్తులతో చర్చలు జరిపితే ఎప్పటికీ ఆ సమస్యకు పరిష్కారం దొరకదని నారాయణ స్పష్టం చేశారు. రగులుతూనే ఉంటుందని నారాయణ స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం విభజించు-పాలించు అనే పాలసీని ఫాలో అవుతోందని ఇది సరికాదని ఆయన తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో సినిమా పరిశ్రమ కుదేలైందని ఆయన అన్నారు. ఉద్యోగుల్లో విభజన తీసుకొచ్చి సమస్య పరిష్కారమైనట్టు చెప్తున్నారని ఈ సందర్భంగా సీపీఐ నారాయణ మండిపడ్డారు.

ఉద్యోగుల విషయంలో చేసినట్లే సినిమా పరిశ్రమ విషయంలో చేస్తే, పరిశ్రమ పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతోందని ఆయన హెచ్చరించారు. సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో ముందుకు రావాలని నారాయణ ప్రభుత్వానికి సూచించారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలపై సీరియస్ గా దృష్టి పెట్టాలని, అప్పుడే దానికి ముగింపు వస్తుందని నారాయణ చెప్పారు. రేపు, మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో.. తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఏపీ సీఎం జగన్ ని కలవనున్న నేపథ్యంలో సిపిఐ నారాయణ ఈ వ్యాఖ్యలు చేయటం విశేషం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − ten =