భారత క్రీడా ప్రపంచంలో మరుపురాని రోజు! కేంద్ర ప్రభుత్వం 2024 ఏడాదికి గాను దేశ అత్యున్నత క్రీడా పురస్కారం “మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న” అందుకున్న విజేతలను ప్రకటించింది. అద్భుతమైన ప్రదర్శనలతో దేశాన్ని గర్వపడేలా చేసిన నలుగురు క్రీడాకారులను ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపిక చేసింది.
ప్రఖ్యాత షూటర్ మను బాకర్‌కు ఈ అవార్డును ప్రదానం చేస్తూ, ఆమెపై వచ్చిన వివాదాలకు కేంద్రం చెక్ పెట్టింది. అవార్డు దరఖాస్తు సమయంలో మను బాకర్, అవార్డుల కమిటీ మధ్య ఉద్భవించిన వివాదం ఇప్పటికే సంచలనం రేపింది.
మనుతో పాటు, ఇటీవలి ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ విజేత గుకేశ్ కుమార్, ప్రతిభావంతుడు పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్, భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్‌లకు కూడా ఈ అవార్డును ప్రదానం చేస్తామని కేంద్రం ప్రకటించింది.
ఈ విశిష్ట ఘనతను రాష్ట్రపతి భవన్ వేదికగా ఈ నెల 17న ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు. ఈ ప్రకటన క్రీడాభిమానుల మనసుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది.
అర్జున అవార్డుకు ఎంపికైన అథ్లెట్లు..
.జ్యోతి యర్రాజీ – అథ్లెటిక్స్
.అన్నూ రాణి – అథ్లెటిక్స్
.నీతూ – బాక్సింగ్
.సావీటీ – బాక్సింగ్
.వంటికా – అగర్వాల్ చెస్
.సలీమా – టెటే హాకీ
.అభిషేక్ – హాకీ
.సంజయ్ – హాకీ
.జర్మన్‌ప్రీత్ సింగ్ – హాకీ
.సుఖజీత్ సింగ్ – హాకీ
.రాకేష్ కుమార్ – పారా ఆర్చరీ
.ప్రీతి పాల్ – పారా అథ్లెటిక్స్
.జీవన్‌జీ దీప్తి – పారా అథ్లెటిక్స్
.అజీత్ సింగ్ – పారా అథ్లెటిక్స్
.సచిన్ సర్జేరావు ఖిలారీ – పారాఅథ్లెటిక్స్
.ధరంబీర్ -పారాఅథ్లెటిక్స్
.ప్రణవ్ సూర్మ – పారా అథ్లెటిక్స్
.హెచ్ హోకాటో సెమా – పారా అథ్లెటిక్స్
.సిమ్రాన్ – పారాఅథ్లెటిక్స్
.నవదీప్ – పారా అథ్లెటిక్స్
.నితీశ్ కుమార్ – పారా బ్యాడ్మింటన్
.తులసిమతి మురుగేషన్ – పారా బ్యాడ్మింటన్
.నిత్య శ్రీ సుమతి శివన్ – పారా బ్యాడ్మింటన్
.మనీషా రామదాస్ – పారా బ్యాడ్మింటన్
.కపిల్ పర్మార్ – పారా జూడో
.మోనా అగర్వాల్ – పారాషూటింగ్
.రుబీనా ఫ్రాన్సిస్ – పారా షూటింగ్
.స్వప్నిల్ సురేష్ కుసలే – షూటింగ్
.సరబ్జోత్ సింగ్ – షూటింగ్
.అభయ్ సింగ్ – స్క్వాష్
.సజన్ ప్రకాష్ – స్విమ్మింగ్
.అమన్ – రెజ్లింగ్