డేటింగ్ యాప్‌లో పరిచయమై..డబ్బులు అడుగుతున్నారా? బీ అలర్ట్

Met on a dating app asking for money Be alert,Met on a dating app,asking for money Be alert,dating app,Online Dating Scam, Cyber fraudsters, robbing lakhs,dating app, asking for money, Be alert,Mango News,Mango News Telugu,Dont Respond to Requests for Financial Help,Online dating scams,Romance scams,Romance scams in 2023,dating app Latest News,dating app Latest Update,dating app,Online Dating Scam Latest News,Online Dating Scam Latest Updates
Online Dating Scam, Cyber fraudsters, robbing lakhs, Met on a dating app, asking for money? Be alert

ఈ మధ్య ఎక్కడ చూసినా.. ఎక్కడ విన్నా ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్నాయన్న వార్తలే. ప్రజలకు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. ఎక్కడో చోట పూర్తి అవగాహన లేక మోసపోవడం, అత్యాశకు పోవడంతో ఆన్ లైన్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి.  చిన్నచిన్న పొరపాట్లు, సైబర్ నేరగాళ్లు మోసపూరిత మాటలు, మెసేజులను నమ్మి.. అకౌంట్లను ఖాళీ చేసుకుని తర్వాత లబోదిబోమంటున్నారు.

ఆన్‌లైన్ బిజినెస్‌లు పెరగడం, ఆన్ లైన్  పేమెంట్లు  చేయాల్సి రావడంతో.. ఈ మధ్య కాలంలో ఈ మోసాలు ఎక్కువ అయ్యాయని సైబర్ నిపుణులు చెబుతున్నారు. దీనిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్న సైబర్ నేరగాళ్లు..ఉచితాలు, బహుమతులు, తక్కువ ధర అని సామాన్యులను టార్గెట్ చేసి తాము చేయాల్సిన పనిని చక్కపెట్టేసుకుంటున్నారు.  దీనికి తోడు మగవాళ్ల వీక్నెస్‌ను అడ్డుపెట్టుకుని వెలుస్తున్న డేటింగ్ యాప్‌లు వారి కొంపలను ముంచేస్తున్నాయి. అమ్మాయే కదా చెప్పినట్లు చేసి నిండా  మునిగిపోతున్నారు మిడిల్ ఏజ్ అండ్ ఓల్డేజ్ వాళ్లు.

ముందు కంటే ఇప్పుడు ఇలాంటి ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకు పెరుగుతుండటంతో.. కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక హెచ్చరికలు జారీ చేసింది. పర్సనల్‌గా కలవకుండా.. కేవలం వాట్సాప్, ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో పరిచయం అయి డబ్బులు అడిగితే వాళ్లకు ఎటువంటి పరిస్థితులలోనూ.. డబ్బులు పంపించవద్దని కోరింది. మెయిన్‌గా ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌ల ద్వారా పరిచయమైన వ్యక్తులకు అయితే పొరపాటున కూడా కొంత మొత్తంలో కూడా డబ్బులు పంపించవద్దని హెచ్చరించింది.

జనాలను మోసం చేయడానికి స్కామర్లు కొత్త పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ఈ మధ్య అహ్మదాబాద్‌కి చెందిన ఓ ఇంజనీర్‌.. తన ఫ్రెండ్ సలహాతో డేటింగ్ యాప్ వాడటం మొదలుపెట్టాడు. అలా డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన ఓ మహిళ చీటింగ్ మాటలతో అతను ఏకంగా కోటి రూపాయలను  కోల్పోయాడు. క్రిప్టో స్కామ్ ద్వారా ఆ మహిళ ఆ టెకీని మోసం చేసినట్లు సైబర్ పోలీసులు చెబుతున్నారు.

ప్రతీ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫారాన్ని ఉపయోగించడంలో స్కామర్లు  ముందుంటున్నారు. యూపీఐ యాప్స్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్,  టెలిగ్రామ్ వంటి యాప్స్ ద్వారానే కాదు..ఆఖరుకు ట్రావెల్ వెబ్సైట్ల ద్వారా కూడా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. మగవాళ్లను టార్గెట్ చేస్తూ..డేటింగ్ యాప్స్, మాట్రిమోనియల్ వెబ్సైట్స్‌ని తమ మోసాలకు వేదికగా మార్చుకుంటున్నారు.

డేటింగ్, మ్యాట్రిమోనియల్ సైట్లలో అందమైన అమ్మాయిలుగా పరిచయం అయి.. ప్రేమ ఉచ్చులోకి లాగుతున్నారు స్కామర్లు. ఆ తర్వాత అసలు కథకు తెరతీసని ఖరీదైన బహుమతులు పంపిస్తామనే సాకుతోనో.. కుటుంబసభ్యులకు ఆపరేషన్ పేరు చెప్పో.. డబ్బులు చెల్లించాలని బలవంతం చేస్తున్నారు. ముఖ్యంగా 50 ప్లస్ ఏజ్ వాళ్లే ఎక్కువ ఈ మోసగాళ్ల బారిన పడుతున్నారు. ఇప్పటి వరకూ ఏకంగా  66 శాతం మంది ఆన్‌లైన్ డేటింగ్ స్కామ్స్ బారిన పడి లక్షల్లో, కోట్లల్లో డబ్బును పోగొట్టుకున్నట్లు సైబర్ పోలీసులు గుర్తించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − six =