సినిమాల్లో విలన్‌గా కనిపించినా, నిజజీవితంలో రియల్ హీరోగా పేరుగాంచిన సోనూ సూద్ మరోసారి వార్తల్లో నిలిచాడు. కరోనా కాలంలో చేసిన సేవలతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ఆయన ఇప్పుడు ఓ వివాదంలో ఇరుక్కున్నారు. లూథియానా కోర్టు ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో ఈ విషయంపై ఉత్కంఠ పెరిగింది.
లూథియానాకు చెందిన న్యాయవాది రాజేష్ ఖన్నా ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. మోహిత్ శుక్లా అనే వ్యక్తి తనను రూ.10 లక్షలు మోసం చేశాడని, ఈ మోసం క్రిప్టోకరెన్సీ వ్యవహారంలో జరిగిందని ఆయన కోర్టులో తెలిపారు. ఈ కేసు విచారణలో భాగంగా కోర్టు సోనూ సూద్‌ను సాక్షిగా పిలిచింది.
కోర్టు పలుమార్లు సమన్లు జారీ చేసినప్పటికీ, సోనూ సూద్ కోర్టుకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో లూథియానా కోర్టు ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ముంబై పోలీసులను ఆయనను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ ఫిబ్రవరి 10న జరగనుంది. ఈ వార్తలు వైరల్ కావడంతో సోనూ సూద్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
“నాకు సంబంధం లేని మూడో వ్యక్తికి సంబంధించిన కేసులో న్యాయస్థానం నన్ను సాక్షిగా పిలిచింది. మా న్యాయవాదులు ఇప్పటికే స్పందించారు. ఈ కేసులో నేను ఎలాంటి బ్రాండ్ అంబాసిడర్‌ని కాదు. నేను ఈ వ్యవహారంలో ఎక్కడా లేను. సెలబ్రిటీలను అప్రయత్నంగా ఇరికించడం బాధాకరం. నా పేరు వాడుకొని పబ్లిసిటీ తెచ్చుకోవాలని చూస్తున్నారు. దీని మీద కఠిన చర్యలు తీసుకుంటాం.” అని ఆయన ట్వీట్ చేశారు.
సోనూ సూద్‌పై నమోదైన కేసు క్రిప్టోకరెన్సీ మోసానికి సంబంధించినదే అయినా, ఆయన దీనికి నేరుగా సంబంధం ఉందా లేదా అన్నది అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. కోర్టుకు ఆయన ఎందుకు హాజరుకాలేదో అన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఫిబ్రవరి 10న జరిగే విచారణలో నిజానిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
We need to clarify that the news circulating on social media platforms is highly sensationalised. To put matters straight, we were summoned as a witness by the Honourable Court in a matter pertaining to a third party to which we have no association or affiliation. Our lawyers…
— sonu sood (@SonuSood) February 7, 2025