సిబిల్ స్కోర్ తగ్గితే ఇలా చేస్తే చాలు..

కొన్నిసార్లు సిబిల్‌ స్కోరు తగ్గిపోయి కొత్త రుణం తీసుకునే సమయంలో ఇబ్బంది ఎదురవుతుంది. సిబిల్‌ స్కోర్‌ ఎంత బాగా ఉంటే అంత ఈజీగా పని అవుతుంది. అలాగే తక్కువ వడ్డీ రేటుతో ఎక్కువ మొత్తంలో రుణం లభించే అవకాశం ఉంటుంది. ఎమర్జెన్సీ టైమ్‌లో కావాల్సిన లోన్స్‌లోనూ సిబిల్ స్కోర్ మెయిన్ పాయింట్ అవుతుంది. మీ సిబిల్‌ స్కోర్‌ బాగా ఉంటేనే పర్సనల్‌ లోన్, హౌస్ లోన్‌ వంటివి ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు వస్తాయి. క్రెడిట్‌ స్కోరు కొన్నిసార్లు తగ్గిపోతున్నపుడు ఇలాంటప్పుడు ఏం చేయాలన్నది చాలా మందికి తెలియదు. క్రెడిట్‌ స్కోరు తగ్గిపోయిందని గుర్తించిన వెంటనే కొత్తగా మీకు తెలియకుండా ఏదైనా అప్పు మీ ఖాతాలో చేరిందా చూసుకోండి. తీసుకున్న లోన్ ఈఎమ్‌ఐల చెల్లింపు ఆలస్యమయ్యిందా? క్రెడిట్‌ కార్డు బిల్లు మొత్తం చెల్లించారా చూసుకోండి. కొన్నిసార్లు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కారణాలతో క్రెడిట్‌ స్కోరుపై ఎఫెక్ట్ పడుతుంది. వాటిని సరిచేసుకోవడం ద్వారా మళ్లీ స్కోరు గాడిన పడేలా చూసుకోవచ్చు.

సాధారణంగా ఈఎంఐలను ఆలస్యంగా చెల్లించినా.. లేదా చాలా కాలంగా వాటిని పట్టించుకోకపోయినా.. క్రెడిట్‌ స్కోరు తగ్గిపోతుంది. ఒకసారి ఈఐఎంని సకాలంలో చెల్లించకపోతే.. తర్వాత కరెక్ట్ టైమ్‌కు పే చేస్తూ ఉండటం వల్ల ద్వారా స్కోరును పెంచుకోవచ్చు. ఎప్పుడూ ఆలస్యం చేస్తుంటే మాత్రం అస్కోరును పెంచుకోలేరు.

లోన్లు సంఖ్య ఎక్కువగా ఉంటే.. క్రెడిట్‌ స్కోరు తగ్గుతుంది. చాలామంది అప్పు మొత్తం తక్కువగానే ఉన్నా.. ఎక్కువ లోన్లు తీసుకుంటారు. ఇలాంటివి వారి లోన్ రిపోర్ట్లో ఆ అంశాలు కనిపిస్తూ ఉంటాయి. చిన్న రుణాలను తీర్చేసి, ఒక పెద్ద అప్పును ఉంచుకోవడం ఎప్పుడూ మంచిది.
చాలా ఏళ్లుగా వాడుతున్న క్రెడిట్‌ కార్డును రద్దు చేసుకున్నప్పుడు కూడా టెంపరరీగా స్కోరుపై ఎఫెక్ట్ పడుతుంది.ఫస్ట్ టైమ్ తీసుకున్న క్రెడిట్‌ కార్డును సాధ్యమైనంత వరకూ రద్దు చేసుకోకపోవడమే బెటర్.

క్రెడిట్‌ కార్డులను ఎప్పుడూ లిమిట్ లోపే వాడాలి. అంతేకాదు.. కార్డు లిమిట్‌ను 30 శాతానికి మించి వాడితే.. మీరు మొత్తం రుణాలపైనే ఆధారపడుతున్నారని బ్యాంకులు అర్థం చేసుకుంటాయి. కాబట్టి క్రెడిట్‌ కార్డు పరిమితిలో 30 శాతానికి మించి వాడొద్దు. 90 శాతం వాడితే.. స్కోరుపై ఎఫెక్ట్ ఉంటుంది.